ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Chennai: పాఠశాలలో ఏసీ తరగతి గది ప్రారంభం

ABN, Publish Date - Jun 03 , 2025 | 11:25 AM

చెన్నై నగరంలో విల్లివాక్కంలోగల ప్రాథమిక పాఠశాలలో ఏసీ తరగతి గది ఏర్పాటు చేశారు. దీనిని మంగళవారం ప్రారంభించారు. ఈ పాఠశాలను కనకదుర్గా తెలుగు పాఠశాలల ట్రస్ట్‌ వారు నిర్వహిస్తున్నారు. అయితే.. అందులో ఓ ఏసీ తరగతి గదిని కూడా ఏర్పాటు చేశారు.

చెన్నై: స్థానిక విల్లివాక్కంలోని కనకదుర్గా తెలుగు పాఠశాలల ట్రస్ట్‌ (ఎస్‌కేడీటీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన ఏసీ తరగతి గదిని ఆ పాఠశాల చైర్మెన్‌, ఏఐటీఎఫ్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సీఎంకే రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లకు శ్రీకారం చుట్టి, కొత్తగా పాఠశాలలో చేరిన చిన్నారులకు పూలదండలు వేసి, టీచర్లతో కలిసి ఆహ్వానం పలికారు.


ప్రధానోపాధ్యాయురాలు ఎస్‌.రేణుక నేతృత్వంలో 1 నుండి 5వ తరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులందరికీ పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, యూనిఫాంపంపిణీ చేశారు. ఈ సందర్భంగా తరగతి గది కి ఏసీ సదుపాయం కల్పించిన ‘నమో గాడ్‌’ ట్రస్టీ డాక్టర్‌ ఎన్‌.నాగభూషణం, డాక్టర్‌ సీఎంకే రెడ్డిలను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎస్‌కేడీటీ మహోన్నత పాఠశాలలో 6 నుండి ప్లస్‌టూ వరకు చదువుకుంటున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలతో పాటు నిఘంటువు, యూనిఫాం ఉచితంగా అందజేశారు.


సీఎంకే రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉద్యోగావకాశాలు రావేమోనన్న ఆందోళనతో తెలుగు మీడియంలో చేర్పించేందుకు ముందుకు రావడం లేదన్నారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలుగు మీడియం తరగతులు మూతబడే అవకాశం ఉంటుందని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తమిళంతో పాటు తెలుగు తదితర ఇతర భాషల్లో కూడా చదువుకునేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి.

నా పేరు కవిత... నేనెప్పుడూ ప్రజలపక్షమే

రాజన్న గోశాలలో మరో మూడు కోడెల మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 03 , 2025 | 11:25 AM