ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Red Fort Drill: ఎర్రకోటలో భద్రతా వైఫల్యం.. ఏడుగురు పోలీసుల సస్పెన్షన్

ABN, Publish Date - Aug 05 , 2025 | 09:13 AM

ఓ స్పెషల్ టీమ్ ఎర్రకోట ప్రాంగణంలో డమ్మీ బాంబును దాచింది. ఆ బాంబును అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారిపై తక్షణ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు.

Red Fort Drill

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ మేరకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ఎర్రకోటలో తీవ్ర భద్రతా వైఫల్యం వెలుగుచూసింది. ఎర్రకోటలో విధుల్లో ఉన్న పోలీసులు డమ్మీ బాంబును గుర్తించలేకపోయారు. దీంతో ఏడుగురిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. రొటీన్ సెక్యూరిటీ డ్రిల్‌లో అలసత్వం వహించిన కారణంగా వారిపై చర్యలు తీసుకున్నారు.

డమ్మీ బాంబ్ కనిపెట్టలేక..

ఓ స్పెషల్ టీమ్ ఎర్రకోట ప్రాంగణంలో డమ్మీ బాంబును దాచింది. ఆ బాంబును అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు కనిపెట్టలేకపోయారు. దీంతో వారిపై తక్షణ క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం ఏడుగురిని సస్పెండ్ చేశారు అధికారులు. హై సెక్యూరిటీ కార్యక్రమం సందర్భంగా నిఘా పెంచడానికి ఢిల్లీ పోలీసులు సెక్యూరిటీ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఎర్రకోటలో ప్రతీరోజూ సెక్యూరిటీ డ్రిల్ జరుగుతోంది. అయితే, స్పెషల్ టీమ్ దాచిన డమ్మీ బాంబ్‌ను మాత్రం ఢిల్లీ పోలీసులు కనిపెట్టలేక చిక్కుల్లో పడ్డారు.

చొరబాటుకు యత్నం..

మరోవైపు బంగ్లాదేశ్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు అక్రమంగా ఎర్రకోటలోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరూ అక్రమ వలసదారులే. ఢిల్లీలో కూలీ పని చేసుకుని జీవిస్తున్నారు. వారందరి వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉంది. పోలీసులు వారి నుంచి కొన్ని బంగ్లాదేశ్ డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడు మామూలోడు కాదు.. మృత్యువుకు హాయ్ చెప్పి వచ్చాడు..

రాజధాని రైతులకు రిటర్న్ గిఫ్ట్!

Updated Date - Aug 05 , 2025 | 11:49 AM