India Pakistan: భారత్ నుంచి పాకిస్తాన్‌కు 4 రోజుల్లో 537 మంది ప్రయాణం
ABN, Publish Date - Apr 28 , 2025 | 07:35 AM
జమ్మూకశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ క్రమంలో పాకిస్తాన్ పౌరులను ఏప్రిల్ 27లోపు భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఇదే సమయంలో పాకిస్తాన్ నుంచి భారత పౌరులు కూడా ఇండియాకు తిరిగి వచ్చారు.
కశ్మీర్ పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ విషయంలో కఠిన నింబంధనలను అమలు చేస్తోంది. దాడి జరిగిన తర్వాత రోజు నుంచి పాకిస్తాన్ పౌరులను ఏప్రిల్ 27లోపు దేశం విడిచి వెళ్లాలని తెలిపింది. దీంతోపాటు పాకిస్తాన్ పౌరులకు వీసాలను కూడా రద్దు చేసింది. ఈ క్రమంలో ఆదివారం చివరి రోజు కావడంతో ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 27 వరకు, నాలుగు రోజుల్లో, 9 మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా మొత్తం 537 మంది పాకిస్తానీ పౌరులు అట్టారి వాఘా సరిహద్దు ద్వారా భారతదేశం నుంచి తిరిగి వెళ్లారు.
చివరి రోజు నాటికి..
ఇదే సమయంలో 850 మంది భారతీయ పౌరులు పాకిస్తాన్ నుంచి భారతదేశానికి తిరిగి రావడానికి అట్టారి సరిహద్దును ఉపయోగించారు. ఏప్రిల్ 22న పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో నేపాలీ పౌరుడు సహా 26 మంది మరణించారు. భారత ప్రభుత్వం 12 వర్గాల స్వల్పకాలిక వీసాదారులను భారతదేశం విడిచి వెళ్ళడానికి అనుమతిస్తూ ఒక ఉత్తర్వు కూడా జారీ చేసింది. ఆదివారం తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా మొత్తం 237 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి-వాఘా సరిహద్దు క్రాసింగ్ ద్వారా భారతదేశం నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఏప్రిల్ 26న 81 మంది, ఏప్రిల్ 25న 191 మంది, ఏప్రిల్ 24న 28 మంది పౌరులు తిరిగి వెళ్లారు.
వీరికి 29 వరకు ఛాన్స్..
ఆదివారం నాడు ఒక దౌత్యవేత్తతో సహా 116 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు దాటి తిరిగి వచ్చారు. ఏప్రిల్ 26న 13 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 342 మంది భారతీయులు తిరిగి వచ్చారు. ఏప్రిల్ 25న 287 మంది భారతీయులు సరిహద్దు దాటగా, ఏప్రిల్ 24న 105 మంది భారతీయులు తిరిగి వచ్చారు. పాకిస్తాన్ పౌరులు కూడా భారతదేశం విడిచి వెళ్ళడానికి విమానాశ్రయాన్ని ఉపయోగించారు.
సార్క్ వీసాదారులు భారతదేశం విడిచి వెళ్ళడానికి చివరి తేదీ ఏప్రిల్ 26 ఉండగా, మెడికల్ వీసా ఉన్నవారికి చివరి తేదీ ఏప్రిల్ 29గా నిర్ణయించారు. ఏప్రిల్ 26 నాటికి భారతదేశం విడిచి వెళ్లాలని ఆదేశించబడిన వీసా వర్గాలలో వీసా ఆన్ అరైవల్, బిజినెస్, ఫిల్మ్, జర్నలిజం, ట్రాన్సిట్, కాన్ఫరెన్స్, పర్వతారోహణ, విద్యార్థి, పర్యాటకుడు, గ్రూప్ టూరిస్ట్, తీర్థయాత్ర, గ్రూప్ పిలిగ్రిమేజ్ వీసా వంటివి ఉన్నాయి. అంతేకాదు ఇండియా నుంచి విడిచి వెళ్లని పాకిస్తాన్ పౌరులకు రూ.3 లక్షల జరిమానాతోపాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు మార్గదర్శకాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి:
Pakistan Citizens: భారత్ విడిచి వెళ్లని పాకిస్తానీలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.3 లక్షల జరిమానా
Akshay Tritiya: అక్షయ తృతీయకు గోల్డ్ కొనలా..వెయిట్ చేయాలా
Bank Holidays: మే 2025లో 12 రోజులు బ్యాంకులు బంద్.. పూర్తి లిస్ట్ ఇదే
NaBFIDలో అనలిస్టు పోస్టులకు నోటిఫికేషన్.. రూ.14 లక్షల జీతంతో మంచి ఛాన్స్
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 28 , 2025 | 07:36 AM