ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Highway Amenity Centers: డ్రైవర్లకు విశ్రాంతి కోసం హైవేల పక్కన 5వేల ఎమినిటీ సెంటర్లు

ABN, Publish Date - Aug 07 , 2025 | 04:16 AM

జాతీయ రహదారులపై దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి

  • ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటు

న్యూఢిల్లీ, ఆగస్టు 6: జాతీయ రహదారులపై దూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని అన్ని జాతీయ రహదారులు, ఎక్స్‌ప్రె్‌సవేల వెంబడి నూతనంగా రెస్ట్‌ స్టాప్‌లను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రతి 30-40 కిలోమీటర్లకు ఒకటి చొప్పున ఏర్పాటయ్యే వీటిలో కారు, బస్సు ప్రయాణికులతో పాటు భారీ వాహనాల డ్రైవర్లు విశ్రాంతి తీసుకోవడానికి వీలుగా సదుపాయాలు కల్పించనుంది. వేసైడ్‌ ఎమినిటీ (డబ్ల్యూఎ్‌సఏ)గా పిలిచే 5వేల నూతన విశ్రాంతి స్థలాల అభివృద్ధి కోసం మంత్రిత్వ శాఖ ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తోంది. ప్రతి కేంద్రంలోనూ కార్లు, బస్సులు, ట్రక్కులు, భారీ వాహనాల పార్కింగ్‌ కోసం స్థలం కేటాయిస్తారు. టాయ్‌లెట్లను ఏర్పాటు చేస్తారు. జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రె్‌సవేల వెంబడి ఉన్న ప్రైవేటు స్థలాల్లో డబ్ల్యూఎ్‌సఏల అభివృద్ధి, నిర్వహణపై ముసాయిదా విధానాన్ని మంత్రిత్వ శాఖ గతవారం విడుదల చేసింది. దీనిపై ఈ నెల 21లోగా తమ అభిప్రాయాలు చెప్పాలని సంబంధిత వర్గాలు, ప్రజలను కోరింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఊటీలో పర్యాటక ప్రాంతాల మూసివేత.. కారణం ఏంటంటే..

అమిత్‌షాపై పరువునష్టం వ్యాఖ్యలు.. రాహుల్‌కు బెయిల్

Read Latest Telangana News and National News

Updated Date - Aug 07 , 2025 | 04:16 AM