ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

NEET UG 2024: 26 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థుల సస్పెన్షన్‌

ABN, Publish Date - May 04 , 2025 | 05:11 AM

నీట్‌-యూజీ 2024 పేపర్‌ లీక్‌పై ఎన్‌ఎంసీ కీలక చర్యలు తీసుకుని 26 ఎంబీబీఎస్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేసింది. అలాగే 42 మంది అభ్యర్థులపై మూడు సంవత్సరాల నిషేధం విధించింది.

14 మంది అడ్మిషన్ల రద్దు.. 215 మంది అడ్మిషన్ల

నిలిపివేత.. నీట్‌కు హాజరు కాకుండా 51 మందిపై నిషేధం

నీట్‌-యూజీ 2024 పేపర్‌ లీకేజీపై ఎన్‌ఎంసీ చర్యలు

న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన నీట్‌-యూజీ 2024 పేపర్‌ లీక్‌ వ్యవహారంలో నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌(ఎన్‌ఎంసీ) చర్యలు తీసుకుంది. లీకేజీతో సంబంధం ఉన్నట్లు గుర్తించిన 26 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులను సస్పెండ్‌ చేయడంతో పాటు రాబోయే విద్యా సంవత్సరానికి 14 మంది అభ్యర్థుల అడ్మిషన్లు రద్దు చేయాలని ఆదేశించింది. విచారణ పెండింగ్‌లో ఉన్న 215 మంది అభ్యర్థుల అడ్మిషన్లను కూడా కమిషన్‌ నిలిపివేసింది. అలాగే నీట్‌-యూజీ పరీక్షకు హాజరు కాకుండా 42 మంది అభ్యర్థులపై మూడేళ్ల పాటు (2024, 2025, 2026), తొమ్మిది మందిపై రెండేళ్ల పాటు (2025, 2026) నిషేధం విధించింది. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ నివేదిక ఆధారంగా సంబంధిత వైద్య కళాశాలలు, సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. నీట్‌-యూజీ 2025 పరీక్షలు మే 4న జరగనున్న నేపథ్యంలో ఎన్‌ఎంసీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉండగా, నీట్‌-యూజీ 2025ను సజావుగా నిర్వహించేందుకు శనివారం అన్ని పరీక్ష కేంద్రాల్లోనూ విద్యాశాఖ అధికారులు మాక్‌ డ్రిల్‌ నిర్వహించారు. దేశవ్యాప్తంగా 500 నగరాల్లోని 5,453 కేంద్రాల్లో ఆదివారం ఈ పరీక్ష జరగనుంది. ఈ ఏడాది పరీక్షకు 22.7 లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

Vastu Tips: ఇంట్లో బంగారాన్ని ఇక్కడ అస్సలు పెట్టకండి

IPL 2025: ఏఐ అద్భుతం.. ఇండియన్ ప్రీమియర్ లడ్డూ లీగ్..

Updated Date - May 04 , 2025 | 05:11 AM