ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Colors Neuroscience: మీరు ఇంత ప్రత్యేకమా.. ఈ విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు..

ABN, Publish Date - Aug 17 , 2025 | 08:16 AM

Colors Neuroscience: చాలా విషయాల్లో మనిషికి మనిషికి మధ్య పోలీక ఉండదు. ప్రపంచంలోని అందరూ ప్రత్యేకమైన వాళ్లే. ఇది నిజంగా దేవుడి సృష్టిలో ఓ అద్భుతం అని చెప్పాలి. మనిషి గురించి లోతుగా తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

Colors Neuroscience

చాలా మంది తమను తాము ‘నేను అందరిలాంటి వాడ్ని కాదు.. చాలా ప్రత్యేకం’ అని అనుకుంటూ ఉంటారు. కొన్ని విషయాల్లో ఇది నూటికి నూరు శాతం నిజమే. వేలి ముద్రలు, నాలుకపై ముద్రలు, బొడ్డు ఇలా చాలా విషయాల్లో మనిషికి మనిషికి మధ్య పోలీక ఉండదు. ప్రపంచంలోని అందరూ ప్రత్యేకమైన వాళ్లే. ఇది నిజంగా దేవుడి సృష్టిలో ఓ అద్భుతం అని చెప్పాలి. మనిషి గురించి లోతుగా తెలుసుకునే కొద్దీ ఆశ్చర్యపరిచే విషయాలు తెలుస్తూనే ఉన్నాయి.

ఇప్పుడు నేను చెప్పబోయే విషయం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. అదేంటో ఓ ఉదాహరణతో చెబుతా.. ఓ లేడీ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతోంది. రోడ్డు పక్కన గోడపై ఓ పోస్టర్‌లో హీరోయిన్ పింక్ శారీ కట్టుకుంది. ఆ లేడీ పింక్ శారీని చూస్తూ ‘ఎంత బాగుంది’ అనుకుంటూ ఉంది. అప్పుడే మరో లేడి అక్కడికి వచ్చింది. ఆమె కూడా ఆ హీరోయిన్ కట్టుకున్న శారీని చూస్తూ ఉంది. ఆమె కూడా ‘శారీ ఎంత బాగుంది’ అనుకుంటూ ఉంది.

ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఆ శారీ పింక్ కలర్లో ఉన్నా.. ఆ ఇద్దరు లేడీలు చూస్తున్న పింక్ కలర్ ఒకటి కాదు. మొదటి లేడీకి కనిపించే పింక్ కలర్, రెండో లేడీకి కనిపించే పింక్ కలర్‌లో తేడా ఉంటుంది. కేవలం పింక్ మాత్రమే కాదు.. సృష్టిలోని ప్రతీ మనిషి చూసే ఒకే రంగులో తేడాలు ఉంటాయి. అందరికీ బ్లూ కలర్ ఒకేలా కనిపించదు. ఇది నేను చెప్పటం లేదు. ఆరిజోనాకు చెందిన న్యూరో సైంటిస్ట్, మైండ్ సెట్ కోచ్ ఎమిలీ మెక్‌డొనాల్డ్ చెబుతున్నారు.

ఆమె ఏమంటున్నారంటే.. ‘మనందరమూ రంగుల్ని వేరు వేరుగా చూస్తాము. ఎందుకో చెబుతా వినండి.. నేను రీసెర్చ్ ల్యాబ్‌లో క్వాంటమ్ క్యాచ్‌పై పని చేసేదాన్ని. కోతులనుంచి రంగులను గుర్తించే కంటి జీనో టైప్‌ను సేకరించాము. అవి అడవుల్లోని ఒకే రంగు పళ్లను ఎలా చూస్తాయో కలర్ ప్లాట్ మ్యాపింగ్ చేశాము. ఏ రెండు కోతులు ఒకే రంగు పండును ఒకేలా చూడటం లేదని తేలింది. అది మనుషులకు కూడా వర్తిస్తుంది. ఇలా జరగడానికి మన కంటిలోని జెనటిక్ కోడ్ ప్రధాన కారణం. అంతేకాదు.. మన వ్యక్తిగత అనుభవాల వల్ల కూడా రంగులను చూసే విధానంలో తేడా ఉంటుంది’ అని అన్నారు.

ఇవి కూడా చదవండి

సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..

మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..

Updated Date - Aug 17 , 2025 | 08:16 AM