Geomagnetic Storms: సూర్యుడిలో విస్ఫోటనాలు.. మనుషులపై తీవ్ర ప్రభావం..
ABN , Publish Date - Aug 17 , 2025 | 07:33 AM
Geomagnetic Storms: సాధారణ సమయంలో బీపీని, జియోమాగ్నటిక్ యాక్టివిటీ సమయంలో బీపీని పోల్చిచూశారు. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మాగ్నటిక్ ఫీల్డుపై ప్రభావం పడుతోంది. భూమి మాగ్నటిక్ ఫీల్డులో ఆటంకాల వల్ల మనుషుల బీపీలో దారుణమైన మార్పులు వస్తున్నాయి.
చైనా సైంటిస్టులు సూర్యుడిపై జరిపిన పరిశోధనల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మాగ్నటిక్ ఫీల్డులో అంతరాయాలు ఏర్పడతాయన్న సంగతి తెలిసిందే. భూమి మాగ్నటిక్ ఫీల్డులో అంతరాయాల కారణంగా మనుషుల ఆరోగ్యంపై ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా బ్లడ్ ప్రెషర్‌పై ప్రభావం పడుతోంది. సైంటిస్టులు కింగ్‌డావో, వీహాయ్ సిటీల్లో ఆరేళ్ల పాటు పరిశోధనలు చేశారు. లక్షల మంది బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ తీసుకున్నారు.
సాధారణ సమయంలో బీపీని, జియోమాగ్నటిక్ యాక్టివిటీ సమయంలో బీపీని పోల్చిచూశారు. సోలార్ యాక్టివిటీ కారణంగా భూమి మాగ్నటిక్ ఫీల్డుపై ప్రభావం పడుతోంది. భూమి మాగ్నటిక్ ఫీల్డులో ఆటంకాల వల్ల మనుషుల బీపీలో దారుణమైన మార్పులు వస్తున్నాయి. ఈ పరిశోధనకు సంబంధించిన వివరాలు కమ్యూనికేషన్స్ మెడిసిన్స్‌లో ప్రచురితమయ్యాయి. దీనిపై సైంటిస్టులు మాట్లాడుతూ.. ‘బ్లడ్ ప్రెషర్, జియోమాగ్నటిక్ యాక్టివిటీ ఒకే రకమైన రిథమ్స్(లయలు) కలిగి ఉంటాయి.
బీపీ, జియోమాగ్నటిక్ యాక్టివిటీ ప్రతీ మూడు నెలలకు, ఆరు నెలలకు, సంవత్సరానికి రిపీట్ అవుతూ ఉంది. గాల్లో ఉష్ణోగ్రతలు, కాలుష్యం కారణంగా కూడా బీపీ ప్రభావితం అవుతోంది. జియోమాగ్నటిక్ తుఫానులు ఎంత ఎక్కువగా సంభవిస్తే బీపీపై అంత ఎక్కువ ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా మహిళల బీపీపై ప్రభావం పడుతోంది. హైబీపీ ఉన్న వారిపై ఇది మరింత ప్రభావం చూపుతోంది. జియోమాగ్నటిక్ యాక్టివిటీ మనుషుల బీపీనీ ఎలా ప్రభావితం చేస్తోందన్న దానిపై మరింత లోతుగా పరిశోధనలు జరగాల్సి ఉంది. ఆ సమయంలో మనుషులు తమను తాము ఎలా రక్షించుకోవాలన్నది కూడా తెలుసుకోవాలి’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..
ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..