Crop Profit: మీ జీవితాన్ని మార్చే పంట.. తక్కువ పెట్టుబడితో లక్షల లాభం..
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:58 AM
Crop Profit: అప్పుల బాధతో అల్లాడిపోయే రైతన్నలకు నేను చెప్పబోయే పంట ఓ వరంలాంటిది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా చేస్తుంది. ఆ పంట ఏంటి? ఎలా పండించుకోవాలి? అన్న వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దేశానికి వెన్నెముక అయిన రైతన్నలు నిత్యం ఎన్నో కష్టాలు పడుతున్నారు. చాలా మంది ఎప్పుడు ఏ పంట వేయాలో సరైన అవగాహన లేక.. పంట పండించటం కోసం పెద్ద మొత్తంలో ఎరువులు, క్రిమి సంహారకాలు వాడి అప్పుల పాలు అవుతున్నారు. అప్పుల కారణంగా దేశం ఈ మూల నుంచి ఆ మూల వరకు నిత్యం పదుల సంఖ్యలో మంది ప్రాణాలు తీసుకుంటూ ఉన్నారు. అప్పుల బాధతో అల్లాడిపోయే రైతన్నలకు నేను చెప్పబోయే పంట ఓ వరంలాంటిది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా చేస్తుంది. అదే.. నల్ల పసుపు. చాలా మందికి పసుపు రంగులో ఉండే పసుపు గురించి తెలుసు కాని.. నల్ల పసుపు గురించి తెలీదు. ఇది చాలా అరుదైన రకం. అంతరించిపోతున్న జాతిలో ఉంది. ఈ నల్ల పసుపు రెగ్యులర్ అవసరాలకు వాడరు. ఆయుర్వేదంలో వాడతారు.
నల్ల పసుపుతో ఆరోగ్య లాభాలు..
నల్ల పసుపు అరుదైనది మాత్రమే కాదు.. ఆరోగ్యపరంగా సాధారణ పసుపుకంటే నల్ల పసుపుతో చాలా లాభాలు ఉంటాయి. ముందుగా చెప్పినట్లు ఆయుర్వేదంలో ఈ పసుపు ఎక్కువగా వాడుతూ ఉంటారు. యాంటీ బయోటిక్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఇందులో పుష్కలంగా ఉంటాయి. నల్ల పుసుపుతో ఈ కింద ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
క్యాన్సర్, ట్యూమర్లను తగ్గిస్తుంది.
లివర్, జీర్ణ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.
ఆస్థమా, దగ్గుతో పాటు ఇతర శ్వాసకోశ సంబంధ సమస్యల్ని తగ్గిస్తుంది.
చర్మ వ్యాధులు, దెబ్బల్ని నయం చేస్తుంది.
అల్సర్స్, అజీర్తి, మైగ్రేషన్స్‌కు అద్భుతంగా పని చేస్తుంది.
నల్ల పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలస్ట్రాల్ కంట్రోల్‌లో ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి మెరుగుపడుతుంది.
నల్ల పసుపును ఎలా పండించాలి
15 నుంచి 40 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు నల్ల పసుపు పండించడానికి అనువైనవి. జనవరి నుంచి ఫిబ్రవరి మధ్య కాలంలో పంట వేస్తే మంచిది. పంట వేయడానికి ముందు భూమిలో సున్నం,నిమ్మ చక్క పొడి మిశ్రమాన్ని చల్లుకోవాలి. 15 రోజుల పాటు భూమిని ఎండ నివ్వాలి. ఎరువుల కింద ఆవు పేడ, వర్మీ కాంపోస్ట్ వాడుకోవాలి. 6 ఇంచుల దూరంతో.. 2 ఇంచులు భూమిలో నల్ల పసుపు నాటుకోవాలి. ఎకరాకు 300 కేజీల నల్ల పసుపు అవసరం అవుతుంది. నల్ల పసుపు పండించడానికి 2.5 లక్షల రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
ఆదాయం వివరాలు..
మీరు ఎకరాకు 2.5 లక్షలు ఖర్చు చేస్తే 10 లక్షల దాకా ఆదాయం వస్తుంది. తడి నల్ల పసుపు కిలో 800 నుంచి వెయ్యి రూపాయలకు అమ్ముడవుతుంది. అదే పొడి రూపంలో అయితే.. కిలో 2500 నుంచి 3500 దాకా అమ్ముడవుతుంది. నల్ల పసుపు ఆకుల నుంచి ఆయిల్ తీస్తారు. లేదా హెర్బల్ పిల్లోస్ తయారు చేస్తారు. కేవలం ఆకుల ధరే కిలో 500 వరకు ఉంటుంది. అంతర్గత పంటలు వేసుకుంటే మరింత లాభం పొందే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి
జ్ఞాన విస్తరణకు పుస్తకాలు కీలకం