Land Acquisition: ఎకరాకు రూ.2 కోట్లు ఇవ్వాలి
ABN , Publish Date - Aug 17 , 2025 | 06:01 AM
వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా ఎకరాకు రూ.2 కోట్లు చెల్లించాలని భూ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు.
లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తాం
మామునూరు ఎయిర్‌పోర్టు భూనిర్వాసిత రైతుల హెచ్చరిక
మామునూరు, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్టు కోసం భూములు కోల్పోతున్న తమకు పరిహారంగా ఎకరాకు రూ.2 కోట్లు చెల్లించాలని భూ నిర్వాసిత రైతులు డిమాండ్ చేశారు. లేకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గాడిపలి, గుంటూర్ పల్లి గ్రామాలకు చెందిన 40 మంది రైతులు శనివారం ఎయిర్‌పోర్ట్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కమర్షియల్ భూములకు సరైన ధర కల్పిస్తామని హామీలిచ్చిన జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఇప్పుడు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు కలెక్టర్ రైతులతో సమావేశం నిర్వహించారని, గజానికి రూ.4 వేలు ఇస్తామని హామీలిచ్చారని తెలిపారు. ఈ విషయమై అనేకసార్లు ఎమ్మెల్యేలను కలిసినా ప్రయోజనం లేదన్నారు.