ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vitamin C: విటమిన్ సి.. చర్మాన్ని ఎలా మెరిసేలా చేస్తుంది..

ABN, Publish Date - Jun 13 , 2025 | 08:33 AM

విటమిన్ సి మీ చర్మాన్ని ఎలా మెరిసేలా చేస్తుంది? విటమిన్ సి వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Vitamin C

Vitamin C Skin Benefits: ఈ మధ్య కాలంలో చాలా మంది చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యలను వదిలించుకోవడానికి రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అయితే, చర్మ సంరక్షణకు విటమిన్ సి క్రీమ్ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి మీ చర్మాన్ని ఎలా మెరిసేలా చేస్తుంది? విటమిన్ సి వల్ల చర్మానికి ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మం కావాలంటే విటమిన్ సి ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ సి ని ఉదయం లేదా రాత్రిపూట ఉపయోగించవచ్చు. కానీ మీరు దీనిని ఒకసారి మాత్రమే ఉపయోగించాలనుకుంటే రాత్రిపూట ఇది మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే విటమిన్ సి మీ చర్మాన్ని సూర్యరశ్మికి సున్నితంగా చేస్తుంది. రాత్రిపూట విటమిన్ సి ని ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా ఉంటుంది. మచ్చలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. విటమిన్ సి జెల్ లేదా క్రీమ్ ను మీ ముఖం, మెడపై సమానంగా అప్లై చేయండి.

విటమిన్ సి ప్రయోజనాలు

  • చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.

  • నల్ల మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది.

  • మీ చర్మాన్ని బలంగా ఉంచే కొల్లాజెన్‌ను పెంచుతుంది.

  • ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

  • విటమిన్ సి తో అందం పెరగడమే కాకుండా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

  • విటమిన్ సి తో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

  • ఎముకలు దృఢంగా మారుతాయి.

  • శరీరంలోని బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఆ సమయంలో రాజకీయాలు మానేయాలనిపించింది..

విమాన ప్రమాదంపై స్పందించిన ట్రంప్.. ఏమన్నారంటే..

For More Health Tips

Updated Date - Jun 13 , 2025 | 02:47 PM