ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Travel Tips: శ్రీలంక సువర్ణావకాశం.. వీసా లేకుండానే 40 దేశాలకు విహరించే ఛాన్స్.!

ABN, Publish Date - Jul 30 , 2025 | 02:13 PM

40 దేశాలకు శ్రీలంక బంపర్ ఆఫర్ ప్రకటించింది. వీసా లేకుండానే ఆ దేశంలో విహరించేందుకు ప్రయాణికులకు సువర్ణావకాశం కల్పిస్తుంది. అయితే, ఏ దేశాలకు ఈ ఆఫర్ ప్రకటించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

Sri Lanka

ఇంటర్నెట్ డెస్క్‌: శ్రీలంక ప్రభుత్వం పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల పౌరులకు వీసా రహిత ప్రయాణం (Visa-Free Travel) అనుమతించింది. అంటే ఇప్పుడు ఈ దేశాల పౌరులు వీసా అవసరం లేకుండా శ్రీలంకను ఈజీగా సందర్శించవచ్చు. పర్యాటకులు స్వేచ్ఛగా, తక్కువ ఖర్చుతో శ్రీలంక అందాలను చూడవచ్చు. అయితే, ఏ దేశాలకు ఈ ఆఫర్ ప్రకటించిందో ఇప్పుడు తెలుసుకుందాం..

వీసా అవసరం లేని దేశాలు..

భారతదేశం, చైనా, మలేషియా, థాయిలాండ్, జపాన్, ఇండోనేషియా, రష్యా, అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్, ఫిన్లాండ్, UAE, ఖతార్, ఒమాన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, కువైట్, ఇరాన్, పాకిస్తాన్, నెపాల్, కజాఖ్‌స్తాన్, ఇజ్రాయెల్ తదితరాల దేశాలు ఉన్నాయి. (మొత్తం 40 దేశాల జాబితా త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టనున్నారు.)

వీసా రహిత ప్రయాణ విధానం అంటే ఏమిటి?

మీరు ఆ దేశానికి వెళ్లడానికి ముందుగా వీసా తీసుకోనక్కర్లేదు. ఎలాంటి ఫీజు లేకుండా, పాస్‌పోర్ట్ మాత్రమే సరిపోతుంది. పర్యాటకులను మరింతగా ఆకర్షించడమే లక్ష్యంగా శ్రీలంక వీసా రహిత ప్రయాణ విధానంను అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానం వల్ల మొదట కాస్త వీసా ఆదాయం తగ్గినా, దీర్ఘకాలంలో పర్యాటకులు ఎక్కువగా వస్తారని తాము నమ్ముతున్నట్లు శ్రీలంక విదేశాంగ మంత్రి విజిత్ హెరాత్ తెలిపారు. పర్యాటక రంగం ఎదగాలంటే ఇదే సరైన దారి అని అన్నారు.

శ్రీలంకలో చూడదగిన టాప్ 5 ప్రదేశాలు

సిగిరియా రాతి కోట: యునెస్కో వారసత్వ ప్రదేశం. ఎక్కితే అద్భుతమైన దృశ్యాలు కనిపిస్తాయి.

అనురాధపుర: పురాతన దేవాలయాలు, స్థూపాలు, బోధి వృక్షం.

దంబుల్లా గుహాలయం: బుద్ధ విగ్రహాలు, గోడ చిత్రలేఖనాలతో ప్రసిద్ధి.

మిరిస్సా బీచ్: తిమింగలాల వీక్షణం, సర్ఫింగ్‌కు అద్భుతమైన ప్రదేశం.

బెంటోటా: బీచ్ రిసార్ట్స్, నదీ సఫారీలు, వాటర్ స్పోర్ట్స్‌కు పర్ఫెక్ట్‌గా సరిపోతుంది.

ఇంకెందుకు ఆలస్యం, శ్రీలంక అందాలను అన్వేషించడానికి ఇది చాలా మంచి అవకాశం. లేట్ చేయకుండా పాస్‌పోర్ట్, టికెట్, బ్యాగ్ రెడీ చేసుకుని శ్రీలంకలోని అందమైన ప్రదేశాలను చూట్టేయండి.

ఇవి కూడా చదవండి:

అల్యూమినియం పాత్రల్లో ఇన్నేళ్లకు మించి వండితే కిడ్నీ సమస్యలు..!

హైదరాబాద్ సమీపంలో అద్భుత జలపాతం.. వర్షాకాలంలో అస్సలు మిస్సవకండి.

Also Read Lifestyle News

Updated Date - Jul 30 , 2025 | 03:39 PM