ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Savings: ఇంట్లో అతి ఖర్చులు.. ఇలా కంట్రోల్ చేయండి..

ABN, Publish Date - Jun 24 , 2025 | 02:39 PM

ఇంట్లో రోజు వారి ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయా? అయితే, ఈ మార్పులను తప్పకుండా చేసుకోండి. లేదంటే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Savings

డబ్బు ఆదా చేయడం చాలా ముఖ్యం. డబ్బు ఆదా చేయడం వలన భవిష్యత్తులో ఆర్థికంగా సురక్షితంగా ఉండవచ్చు. ఊహించని ఖర్చులను ఎదుర్కోవడానికి, ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సహాయపడుతుంది. కాబట్టి, ప్రతి ఒక్కరు తమ జీతంలో వచ్చే ఆదాయం నుండి కొంత సేవింగ్స్‌ ఉంచుకోవాలి. ఇలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా వాటిని ఎదుర్కోవడం సులభం అవుతుంది. అయితే, ఈ కాలంలో డబ్బు సంపాదించడం కంటే ఖర్చులను నియంత్రించడం, పొదుపు చేయడం చాలా మందికి పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే వచ్చే అదాయంతో పాటు ఖర్చులు కూడా అలానే పెరుగుతున్నాయి. అయితే, ఈ చిన్న అలవాట్లను మార్చుకుంటే పరిస్థితి కాస్త మెరుగుపరచుకోవచ్చు.

అవసరాలకు మాత్రమే..

చాలా మంది ఎటువంటి బడ్జెట్ లేకుండా ఖర్చులు ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని వలన సేవింగ్స్‌ చేయడం కష్టమవుతుంది. కాబట్టి, అవసరాలకు మాత్రమే డబ్బును ఖర్చు చేయడం అలవాటు చేసుకోండి. మిగిలిన డబ్బును సేవింగ్స్‌ చేసుకోండి. ఇలా చేయడం వలన అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉంటారు. తద్వారా సేవింగ్స్ పెరుగుతాయి. కొన్నిసార్లు చిన్న చిన్న ఖర్చులు కూడా ఎక్కువ అవుతుంటాయి. షాపింగ్‌ , రెస్టారెంట్‌, గ్రోసరీస్‌ వంటి ఇతర ఖర్చులను వీలైనంత వరకు తగ్గించుకోవడం మంచిది. అలాగే, కరెంట్‌ బిల్లును కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఎలక్ట్రిసిటీ బిల్లు ఎక్కువగా రాకుండా ఉండటం కోసం ఇంట్లో నుండి బయటకు వెళ్లేటప్పుడు లైట్లు, ఫ్యాన్లు ఆఫ్‌ చేయడం మరిచిపోవద్దు. ఎలక్ట్రిక్‌ వస్తువుల వినియోగాన్ని ఎంత తగ్గించుకుంటే బిల్లు అంత తక్కువగా వస్తుంది.

అన్ని పనులు ఒకేసారి..

అలాగే, పని మీద బయటకు వెళ్లినప్పుడు అన్ని పనులు ఒకసారి పూర్తి చేసుకునేలా ముందే ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే, ఎక్కువ సార్లు బయటకు వెళ్లి రావడం వలన రవాణా ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయి. వీలైనంత వరకు ప్రభుత్వ రవాణాను ఎంపిక చేసుకోవడం మంచిది. దీనివలన ఖర్చు తగ్గుతుంది. డబ్బును ఆదా చేసుకోవాలంటే ఇటువంటి చిన్న చిన్న మార్పులు తప్పకుండా చేయండి. ఇవి పాటిస్తూ అతి ఖర్చులను తగ్గించుకుంటే కొంత సేవింగ్స్ చేసుకునే అవకాశం ఉంటుంది. డబ్బును సంపాదించడమే కాదు, దానిని ఎలా వాడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. సేవింగ్స్ అలవాటు భవిష్యత్తులో భద్రతను తీసుకొస్తుంది. ఈ చిన్న మార్పులు మీ ఖర్చులను తగ్గించి, ఆదాయాన్ని వినియోగించడంలో స్పష్టతను ఇస్తాయి. ఇవే మీ భవిష్యత్ పెట్టుబడులకు బలమైన అడుగులు కావచ్చు.

Also Read:

పెరుగుతున్న ఖర్చులు.. ఆర్థిక భద్రత కోసం ఇలా ప్లాన్ చేయండి..

ప్రేమలో ఉన్న అమ్మాయిలు ఎక్కువగా చేసే తప్పులు ఇవే.. మీరు కూడా చేస్తుంటారా..

For More Lifestyle News

Updated Date - Jun 24 , 2025 | 03:18 PM