Lending Money Wisely: వీళ్లకు డబ్బు అప్పుగా ఇచ్చారో.. నష్టం తప్పదు!
ABN, Publish Date - Jul 08 , 2025 | 09:28 PM
Avoid Lending Money to These People: డబ్బు చేతిలో లేనిదే రోజు గడవడం అసాధ్యం. ఉదయం నిద్రలేచిన క్షణం నుంచి మన జీవితాన్ని నడిపించేది డబ్బే. మనిషికి ఆరో ప్రాణంగా మారింది మనీ. అందుకే ఈ డబ్బును చేజిక్కించుకునేందుకు జనాలు చేసే ఫీట్లు ఎన్నెన్నో. అవసరంలో అడిగారు కదా అని ఇలాంటి అనర్హులకు డబ్బులిచ్చారనుకోండి. ఇక మీ జీవితం గంగపాలు చేసేవరకూ వదలరు.
ధనమూలం ఇదం జగత్ అన్నారు పెద్దలు. మనిషిని బతికించే ఇంధనం డబ్బు. ఇది లేకపోతే మూడు పూటలా ఎక్కడా మెతుకులు పుట్టవు. ఎలాగూ మానవుని అవసరాలకూ.. కోర్కెలకూ అంతూపొంతూ ఉండదు కాబట్టి ఎంత డబ్బు సంపాదించినా ఇంకా కావాలనే ఆశ చావదు. కొందరేమో ఎంత చాకిరీ చేసినా బీదరికం నుంచి గట్టున పడలేరు. అయితే, ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు ఆస్తిపరుడు.. బీదవాడూ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరికీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. మనకు తెలిసిన చాలామంది స్నేహితులు, బంధువులు ఏదొక సందర్భంలో అప్పులు అడుగుతూనే ఉంటారు. పరిచయస్థులకూ కొన్నిసార్లు చేబదులు ఇచ్చేస్తుంటాం. మనకూ అక్కరకు వచ్చినపుడు ఇస్తారు కదా అని. కానీ, ఇలాంటి వాళ్లకు డబ్బు అప్పుగా ఇస్తే కచ్చితంగా నష్టపోతారు.
ఎవరికి రుణం ఇవ్వకూడదు?
మతిమరుపు:
కొంతమంది రుణం తీసుకున్నప్పుడు దానిని తిరిగి చెల్లించడం మర్చిపోతారు. కొన్నిసార్లు ఇచ్చామని వాదిస్తారు. అలాంటప్పుడు వారు ఎప్పటికీ తిరిగి ఇవ్వరు. వీరు మ్మల్ని పదే పదే అప్పు అడిగితే డబ్బు కచ్చితంగా ఇవ్వకండి. ఎందుకంటే వీరు అప్పు తీసుకున్న విషయమే మర్చిపోతారు.
సరదా కోసం రుణాలు:
కష్ట సమయాల్లో అప్పులు తీసుకునే వారు కొందరైతే.. కేవలం సరదా కోసం అప్పులు తీసుకునే వారు కొందరు ఉంటారు. షాపింగ్ చేయడానికి లేదా ఎంజాయ్ చేయడానికి తెలిసినవారి నుంచి డబ్బు అప్పుగా తీసుకుంటూ ఉంటారు. డబ్బు వృధా చేసే ఇలాంటివారికి మీరు అప్పు ఇవ్వకూడదు.
పదే పదే అప్పు కోరేవారు:
కొంతమంది ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వకుండానే అప్పులు అడుగుతారు. ఇప్పుడే డబ్బు ఇవ్వండి, అన్నీ కలిపి చెల్లిస్తాను అని దీనంగా అడుగుతూ ఉంటారు. గతంలో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా మళ్ళీ డబ్బు అడుగుతుంటే అప్పు ఇవ్వకండి.
ఉదాసీనంగా ఉండేవారు:
కొంతమంది రుణాలు తీసుకునేటప్పుడు చాలా బాగా మాట్లాడతారు. స్నేహపూర్వకంగా ప్రవర్తిస్తారు. మీరు రుణం తిరిగి చెల్లించమని అడిగినప్పుడు వారు మిమ్మల్ని విస్మరిస్తారు. మీరు ఫోన్ చేస్తే కాల్ కూడా లిఫ్ట్ చెయ్యరు. ఇలాంటి వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు ఇవ్వకండి. ఎందుకంటే వారు మీ డబ్బును పూర్తిగా తిరిగి ఇస్తారనే హామీ లేదు.
అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వచ్చేవారు:
కొంతమందికి సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే మనకు స్నేహితులు, బంధువులు ఉన్నారని గుర్తొస్తుంది. మరికొన్నిసార్లు మనల్ని తెలియనట్లుగా అహంకారంతో ప్రవర్తిస్తారు. ఇలా ప్రవర్తించే వారు అప్పు అడిగితే ఇవ్వకండి. ఎందుకంటే వారు తమ అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరకు వస్తారు. కానీ మీరు వారిని సహాయం అడిగితే వారు మీ వైపు కన్నెత్తి చూడరు. కాబట్టి. తమ డబ్బును పొందడానికి ప్రయత్నిస్తున్న వారికి రుణాలు ఇవ్వకండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
IRCTC స్పెషల్ టూర్ ప్యాకేజీ... 17 రోజుల్లోనే 30 రామక్షేత్రాలు చూసే ఛాన్స్..
బస్సులో మీ లగేజీ మరిచిపోయారా.. టెన్షన్ పడకండి.. ఇలా చేస్తే చాలు..
For More Lifestyle News
Updated Date - Jul 09 , 2025 | 09:10 PM