Shoes without Socks: సాక్స్ లేకుండా బూట్లు వేసుకుంటే ఏమవుతుందో తెలుసా..
ABN, Publish Date - Jun 09 , 2025 | 04:41 PM
కొంతమంది ఫ్యాషన్ కోసం సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తారు. సాక్స్ లేకుండా బూట్లు ధరించడం సౌకర్యంగా ఉంటుంది. కానీ ఈ చిన్న అలవాటు అనేక సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shoes without Socks: ఈ రోజుల్లో చాలా మంది సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తున్నారు . ఈ అలవాటు యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది ఫ్యాషన్ అని సాక్స్ వేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇంకొంత మంది దురదగా అనిపించి వేసుకోరు. కానీ, ఈ అలవాటు చాలా సమస్యలను కలిగిస్తుందని మీకు తెలుసా? ఈ అలవాటు బూట్లకు మాత్రమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
రక్త ప్రసరణ సమస్యలు:
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాలు దెబ్బతింటాయి. ఇది మీ శరీర రక్త ప్రసరణపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి, సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల మీ పాదాల భాగాలపై ఎక్కువ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుంది.
అలెర్జీ సమస్యలు:
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి. కొంతమందికి చాలా సున్నితమైన చర్మం ఉంటుంది. కాబట్టి సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలలో అలెర్జీ సమస్యలు వస్తాయి.
ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రమాదం:
కొన్ని ఆరోగ్య నివేదికల ప్రకారం, సగటున ఒక వ్యక్తి పాదాలు ప్రతిరోజూ 300 మి.లీ. చెమటను ఉత్పత్తి చేస్తాయి. మీరు సాక్స్ లేకుండా బూట్లు ధరిస్తే, ఈ చెమట తేమను పెంచుతుంది. ఇది అనేక రకాల బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.
చెమటలు పట్టడం:
సాక్స్ లేకుండా బూట్లు ధరించడం వల్ల పాదాలపై చెమట పేరుకుపోతుంది. దీనివల్ల బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. పాదాల నుండి దుర్వాసన వస్తుంది. సాక్స్ క్లీన్‌గా లేకుంటే పాదాలు మురికిగా మారి బ్యాక్టీరియా చేరుతుంది. దీనివల్ల పాదాలపై దురద, బొబ్బలు వస్తాయి.
ఈ విషయాలపై శ్రద్ధ తీసుకోండి:
మంచి నాణ్యత గల బూట్లు ధరించండి.
మీరు ధరించే బూట్లు బిగుతుగా లేదా వదులుగా ఉండకూడదు.
మంచి నాణ్యత గల సాక్స్ ధరించండి.
ప్రతిరోజూ మీ సాక్స్‌లను మార్చండి.
శుభ్రమైన సాక్స్‌లను వేసుకోండి.
Also Read:
ఈ పండు తింటే మాంసం అవసరమే ఉండదు..
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఈ చెడు అలవాట్లను వెంటనే మానుకోండి..
For More Lifestyle News
Updated Date - Jun 09 , 2025 | 04:42 PM