Jack Fruit : ఈ పండు తింటే మాంసం అవసరమే ఉండదు..
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:35 PM
మన ఆహారం, జీవనశైలి సరిగ్గా ఉన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. అందుకే, మన శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పండ్లు, కూరగాయలతోపాటు మాంసాహారాన్ని తీసుకోవాలి. మాంసాహారాన్ని తినడానికి ఇష్టపడని వారు దానికి సమానమైన ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Jack Fruit: పనస పండుకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. దీనిని ఇంగ్లీష్‌లో జాక్‌ఫ్రూట్ అంటారు. ఇది చాలా రుచిగా ఉంటుంది. అంతేకాకుండా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ పండులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయని, మాంసానికి ప్రత్యామ్నాయంగా తినవచ్చని వైద్యులు అంటున్నారు. కాబట్టి, దీనిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో వివరంగా తెలుసుకుందాం..
డయాబెటిస్‌కు ఉపశమనం..
ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, కార్బోహైడ్రేట్లు, ఎలక్ట్రోలైట్లు, ఐరన్, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఇతర పండ్ల కంటే ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. జాక్‌ఫ్రూట్‌లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. దీంతో డయాబెటిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే, పనస పండులో తక్కువ గ్లైసెమిక్ సూచిక ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
గుండె ఆరోగ్యం..
గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పనస పండు సహాయపడుతుంది. దీనిలో పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. పనసపండుని మితంగా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటును నియంత్రించడమే కాకుండా గుండె సంబంధిత ఇతర ఆరోగ్య సమస్యలనూ నివారిస్తుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది..
ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా, మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే, ఈ పండులోని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధించడంలో సహాయపడతాయి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే.. ఈ చెడు అలవాట్లను వెంటనే మానుకోండి..
పెళ్లి కూతురికి కట్నంగా 100 పునుగు పిల్లులు..
For More Health News