ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Smartphone: మీ మొబైల్ వెనుక కరెన్సీ నోట్లు పెడుతున్నారా.. వెరీ డేంజర్..

ABN, Publish Date - May 23 , 2025 | 12:06 PM

కొంతమంది తమ ఫోన్‌ను వాలెట్‌గా ఉపయోగిస్తారు. వారు తమ ఫోన్ల వెనుక కవర్‌లో ATM కార్డులు లేదా డబ్బును పెట్టుకుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు.

Money

Smartphone: స్మార్ట్‌ఫోన్‌లు మన జీవితంలో ఒక భాగంగా మారాయి. కొంతమంది ఫోన్ లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరు. మరోవైపు, కొంతమంది తమ ఫోన్‌ను వాలెట్‌గా మార్చుకుంటారు. వారు తమ ఫోన్ల వెనుక కవర్‌లో ATM కార్డులు లేదా డబ్బును పెట్టుకుంటారు. అయితే, ఇలా చేయడం చాలా ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల మీ ఫోన్ ఏ క్షణంలోనైనా పేలిపోయే అవకాశం ఉందని అంటున్నారు. దీనికి కారణం ఏమిటి? ఫోన్లు పేలకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..


పేలిపోయే ప్రమాదం

ఫోన్ వెనుక కవర్‌లో నోట్లు, సిమ్, పిన్ వంటి చిన్న వస్తువులను ఉంచడం వల్ల ఫోన్ దెబ్బతినవచ్చు లేదా పేలిపోవచ్చు. 10, 20, 50 నోట్లను ఫోన్ కవర్ లోపల పెట్టుకుంటే ఏం జరుగుతుందులే అని లైట్‌గా తీసుకోకండి. మీరు చేసే చిన్న పొరపాటు వల్ల మీ 20 వేల విలువైన ఫోన్ పాడవుతుంది. డబ్బును అలా ఫోన్ వెనుక ఉంచడం వల్ల ఫోన్ వేడెక్కుతుంది. ఉష్ణోగ్రత పెరిగితే, బ్యాటరీ వేడెక్కి పేలిపోయే ప్రమాదం ఉంది.


ఫోన్ వెనుక కవర్‌లో కరెన్సీ నోట్లను ఉంచడం వల్ల పేలుడు ప్రమాదం ఉండటమే కాకుండా, ఫోన్ బ్యాటరీ త్వరగా దెబ్బతింటుంది. వైర్‌లెస్ ఛార్జింగ్ పనిచేయదు. నెట్‌వర్క్ సరిగా పనిచేయదు. అంతేకాకుండా, చాలా మంది స్టైలిష్‌గా కనిపించడం కోసం ఫోన్‌కు మందపాటి కవర్లను తీసుకుంటారు. దీనివల్ల ఫోన్ చల్లబడటానికి బదులుగా వేడెక్కుతుంది. ఇలాంటి చిన్న అలవాటు కూడా ప్రమాదకరం. కాబట్టి, ఫోన్ కవర్‌లో ఏమీ పెట్టకోకుండా ఉండటం మంచిది. ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ను అస్సలు ఉపయోగించవద్దు. ఫోన్‌కు మందపాటి కవర్‌ను వాడటం కూడా మంచిది కాదు. ఫోన్ వేడిగా ఉంటే దాన్ని కాసేపు పక్కన పెట్టండి. మీ ఫోన్‌ కవర్‌లో డబ్బు పెట్టుకుని అలవాటు మానుకోండి. లేకపోతే ప్రమాదం జరుగవచ్చు.


Also Read:

ఈ మేక తెలివి మామూలుగా లేదుగా.. ఎలా తప్పించుకుందో చూడండి..

ఎలుగుబంటి హల్‌చల్.. వణికిపోతున్న ప్రజలు

For More Telugu And National News

Updated Date - May 23 , 2025 | 12:21 PM