Hair Care Tips: మీ జుట్టు ఎక్కువగా రాలిపోతుందా.. ఇంట్లో ఉన్న ఈ వస్తువులతో పరిష్కారం
ABN, Publish Date - May 27 , 2025 | 05:57 PM
జుట్టు రాలడం అనేది ఒక సాధారణ సమస్య. ముఖ్యంగా మహిళలు ఈ సమస్యతో ఎక్కువగా ఇబ్బంది పడతారు. అయితే, ఇంట్లో ఉన్న ఈ వస్తువులతో జుట్టు రాలిపోయే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జుట్టు అందాన్ని పెంచుతుంది. అయితే, ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా జట్టు రాలే సమస్యతో బాధపడతున్నారు. జుట్టు రాలడం అనేది ప్రస్తుతం స్త్రీ, పురుషులిద్దరిలోనూ ఒక సాధారణ సమస్య. జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇంట్లో ఉన్న ఈ వస్తువులతో హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని జుట్టు రాలిపోయే సమస్యకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
హెయిర్ ప్యాక్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు:
2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలు
10 మందార పువ్వులు
20 నుండి 25 మందార పువ్వు ఆకులు
రెండు గుప్పెళ్ల వేప ఆకులు
మందార ఆకులు, మందార పువ్వులు, వేప ఆకులను రెండు రోజుల పాటు ఎండలో బాగా ఆరబెట్టాలి. తరువాత దాన్ని మెత్తగా పొడిగా చేసి పక్కన పట్టాలి. తర్వాత నీటిలో రెండు టేబుల్ స్పూన్ల అవిసె గింజలు వేసి పది నిమిషాలు బాగా మరిగించాలి. ఇప్పుడు మీరు దానిని ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేయవచ్చు. హెయిర్ ప్యాక్‌ని బాగా కలిపి మీ తల చివర్ల నుండి వేర్ల వరకు 10 నిమిషాలు మసాజ్ చేయండి. తర్వాత షాంపూ ఉపయోగించకుండా మీ జుట్టును కడగాలి. అందువలన, ఈ హెయిర్ ప్యాక్ ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది.
Also Read:
ప్రతి రోజు చియా గింజలు తింటున్నారా.. ఈ ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి..
ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే ఏం జరుగుతుంది..
For More Health News
Updated Date - May 27 , 2025 | 05:57 PM