Health News: ఆహారం తిన్న వెంటనే నీరు తాగితే ఏం జరుగుతుంది..
ABN , Publish Date - May 27 , 2025 | 01:43 PM
చాలా మంది ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతారు. అయితే, ఈ అలవాటు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మీ జీర్ణక్రియ బాగుండాలంటే భోజనం చేసిన వెంటనే నీరు తాగకూడదని సూచిస్తున్నారు.
ప్రతి రోజు తగినంత నీరు తాగడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు ఎప్పుడూ చెబుతుంటారు. ఎందుకంటే నీరు మన శరీరానికి అనేక విధాలుగా సహాయపడుతుంది. దీనివల్ల మనం హైడ్రేటెడ్ గా ఉంటాము. అయితే, కొంత మందికి భోజనం చేసేటప్పుడు నీరు తాగే అలవాటు ఉంటుంది. ఇంకొంత మందికి భోజనం తర్వాత వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది. అయితే, ఈ అలవాటు ఆరోగ్యానికి మంచిదేనా? ఈ విషయంపై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
జీర్ణవ్యవస్థకు హాని
మన పెద్దలు ఎప్పుడూ ఆహారం తీసుకున్న వెంటనే నీరు తాగకూడదని చెబుతుంటారు. అయితే, దీని వెనుక ఉన్న కారణం ఏమిటో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆయుర్వేదం ప్రకారం, తిన్న వెంటనే నీరు తాగకూడదు. ఎందుకంటే, అది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. జీర్ణవ్యవస్థకు హానికరమైన ప్రభావాలను చూపుతుంది. . ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయకుండా ఆటంకం కలిగిస్తుంది. దీనివల్ల గ్యాస్, జీర్ణ సమస్యలు వస్తాయి.
30 నుండి 45 నిమిషాలు
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ రసాలు పలుచన అవుతాయని, దీనివల్ల అవి సమర్థవంతంగా పనిచేయవని నిపుణులు చెబుతున్నారు. శరీరం ఆహారంలోని పోషకాలను సరిగా తీసుకోలేదు. అంతే కాకుండా, జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. కాబట్టి, నిపుణుల అభిప్రాయం ప్రకారం, భోజనం చేసిన తర్వాత వెంటనే నీరు తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం చేసిన కనీసం 30 నుండి 45 నిమిషాల తర్వాత నీరు తాగాలి.
Also Read:
మారుతున్న వాతావరణం... పిల్లల్ని రక్షించే 5 సూపర్ ఫుడ్స్..
భారీ వర్షాలతో ఐదుగురు మృతి.. పంట, ఆస్తి నష్టం
For More Health News