Head Bath: తల స్నానం చేసిన వెంటనే ఇవి తింటే ప్రమాదం..
ABN, Publish Date - Jun 10 , 2025 | 08:12 AM
తల స్నానం చేసిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. వాటిని తినడం వల్ల చెడు ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. కాబట్టి, తల స్నానం చేసిన తర్వాత ఏ ఆహారాలు తినడం మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..
Head Bath: కొంతమందికి స్నానం చేసిన తర్వాత భోజనం తినే అలవాటు ఉంటుంది. ఇది మంచి పద్ధతి అయినప్పటికీ, ఈ సమయంలో తినే కొన్ని ఆహారాలు మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాలను చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా తల స్నానం చేసిన తర్వాత కొన్ని ఆహారాలు తినడం మంచిది కాదని సూచిస్తున్నారు. కాబట్టి, తల స్నానం చేసిన తర్వాత ఏ ఆహారాలు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
తేనె - పెరుగు:
తల స్నానం చేసిన తర్వాత తేనె పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే, ఈ రెండు ఆహార పదార్థాలు శరీరంలో గ్యాస్ ఏర్పడటానికి కారణమవుతాయి. జీర్ణవ్యవస్థను దెబ్బతిస్తాయని అంటున్నారు.
మిరియాలు, మిరపకాయలు
తల తడిగా ఉన్నప్పుడు మిరియాలు, మిరపకాయలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీర ఉష్ణోగ్రత పెరగడం, తలనొప్పి, తలలో భారంగా అనిపించడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే, అధికంగా నూనె లేదా వేయించిన ఆహారాలు పోషకాల శోషణను తగ్గిస్తాయి. అవి శరీరంలో తలనొప్పికి కారణమవుతాయి. కాబట్టి, తల తడిగా ఉన్నప్పుడు వీటిని తినకపోవడమే మంచిది.
ఊరగాయలు
ఊరగాయలు, పెరుగు వంటి పుల్లని ఆహారాలు శరీరంలో ఆమ్ల స్థాయిలను పెంచి తలనొప్పికి కారణమవుతాయి. దీనివల్ల అలసట, మానసిక ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.
ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి
ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి ఎక్కువగా ఉన్న వంటకాలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, తల తడిగా ఉన్నప్పుడు వాటిని తీసుకోవడం వల్ల శరీరంలో కఫం, జలుబు సమస్యలు పెరుగుతాయి. తల తడిగా ఉన్నప్పుడు మీ శరీరం సున్నితంగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ఎక్కువగా చల్లని, కారంగా, వేడిగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారాలు, చక్కెర ఉన్న ఆహారాలు తినకూడదు. ఇవి మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. తలనొప్పి, చలి, అలసటకు కారణమవుతాయి. కాబట్టి, తలస్నానం తర్వాత వీటిని తీసుకోకండి.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
రాజా మర్డర్.. వైరల్‌గా మారిన పెళ్లి వీడియో..
Rice: 3 నెలల రేషన్ బియ్యం 30 వరకు పంపిణీ
For More Health News
Updated Date - Jun 10 , 2025 | 08:24 AM