Viral Video: రాజా మర్డర్.. వైరల్‌గా మారిన పెళ్లి వీడియో..
ABN , Publish Date - Jun 10 , 2025 | 08:03 AM
Raja Raghuvanshi Case: రాజా హత్యలో అతడి భార్య సోనమ్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

మధ్య ప్రదేశ్‌కు చెందిన రాజా రఘువంశీ అనే వ్యక్తి మేఘాలయలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. భార్య సోనమ్‌తో కలిసి హనీమూన్‌కు వెళ్లిన అతడ్ని నలుగురు వ్యక్తులు కత్తితో పొడిచి చంపేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. రాజా హత్యలో అతడి భార్య సోనమ్ హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆమెను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సోనమ్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
సోనమ్, రాజాల పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్‌గా మారింది. ఇన్‌కాగ్నిటో అనే ఎక్స్ ఖాతాదారుడు ఆ వీడియోను షేర్ చేశాడు. ‘సోనమ్, రాజా రఘువంశీల పెళ్లి వీడియోను ఓ సారి చూడండి. సోనమ్‌కు ఈ పెళ్లి ఇష్టం లేదన్న సంగతిని మీరు కూడా అంగీకరిస్తారు. ఆ పెళ్లికి సోనమ్ ఓకే చెప్పకుండా ఉండి ఉంటే.. రాజా బతికి ఉండేవాడు. కాంట్రాక్ట్ కిల్లర్లతో హత్య చేయించే ధైర్యం ఉంది కానీ, ప్రియుడితో లేచిపోయే ధైర్యం లేదా.. సైకోలా ఉంది. ఇందులో సోనమ్ తల్లిదండ్రుల తప్పుకూడా ఉంది.
సోనమ్‌కు లవర్ ఉన్నాడని వారికి ముందే తెలిసి ఉండాలి. రాజాకు ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేశారు’ అని రాసుకొచ్చాడు. ఇక, అతడు షేర్ చేసిన వీడియోలో రాజా రఘువంశీ.. సోనమ్ నుదిటిలో సిందూరం పెడుతూ ఉన్నాడు. ఆ సమయంలో సోనమ్ ముఖంలో ఎలాంటి సంతోషం లేదు. బాధ మాత్రమే ఉంది. నేల వైపు చూస్తూ ఉంది. 15 సెకన్ల వీడియోలో రాజా ఎంతో సంతోషంగా ఉన్నాడు. సోనమ్ మాత్రం దిగాలుగా ఉంది. వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. సోనమ్ తీరును తప్పుబడుతున్నారు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని భర్తను చంపటం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన ధరలు