ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కలల ‘సౌధం’ కట్టుకున్నారు...

ABN, Publish Date - Aug 10 , 2025 | 08:20 AM

కలల సౌధాన్ని నిర్మించుకునేందుకు కొందరు తమ జీవితాన్ని ధారపోస్తారు. ఆ కోవకు చెందిన వారే కెనడాకు చెందిన వేన్‌ ఆడన్స్‌, కేథరిన్‌ కింగ్‌ దంపతులు. సరస్సు మధ్యలో ద్వీపాన్ని తలపించేలా తేలియాడే ఇంటిని నిర్మించుకున్నారు. సదరు ‘ఫ్లోటింగ్‌ హౌజ్‌’ ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది.

కలల సౌధాన్ని నిర్మించుకునేందుకు కొందరు తమ జీవితాన్ని ధారపోస్తారు. ఆ కోవకు చెందిన వారే కెనడాకు చెందిన వేన్‌ ఆడన్స్‌, కేథరిన్‌ కింగ్‌ దంపతులు. సరస్సు మధ్యలో ద్వీపాన్ని తలపించేలా తేలియాడే ఇంటిని నిర్మించుకున్నారు. సదరు ‘ఫ్లోటింగ్‌ హౌజ్‌’ ప్రముఖ పర్యాటక ప్రదేశంగానూ గుర్తింపు పొందింది.

సాధారణంగా ఇల్లు కట్టుకోవడానికి మంచి స్థలం కోసం అన్వేషిస్తారు. కానీ ఆడన్స్‌, కేథరిన్‌ దంపతులు మాత్రం మంచి సరస్సు కోసం అన్వేషించారు. నేలపై కాకుండా నీళ్లపై నివసించాలన్నది వాళ్ల చిరకాల కోరిక. అందుకే ఏరి కోరి మరీ బ్రిటిష్‌ కొలంబియాలోని టొఫినో తీరంలో... ఒక సరస్సులో వారి కలల ఇంటిని నిర్మించుకున్నారు. నీటిపై తేలియాడే ఆ ఇల్లు స్వర్గాన్ని తలపిస్తుంది. ఆ ఇంటికి ‘లిబర్టీ కోవ్‌’ అని పేరు పెట్టుకున్నారు.

దశాబ్దాల నిర్మాణం

‘లిబర్టీ కోవ్‌’ను 12 ప్లాట్‌ఫామ్‌లపై, మొత్తం కలపతోనే నిర్మించడం విశేషం. వంతెనల ద్వారా నిర్మాణాలన్నింటిని కలిపారు. 1992లోతేలియాడే ఇంటి నిర్మాణపు పనులు ప్రారంభించారు. కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లోకి మారిపోయి, క్రమ క్రమంగా విస్తరణ పనులు చేసుకుంటూ వచ్చారు. అడవి జంతువుల నుంచి రక్షణ కోసం ఈ ఇల్లు చక్కటిపరిష్కారం అంటారు ఆడన్స్‌. గార్డెనింగ్‌ అంటే ఇద్దరికీ మక్కువ. అందుకే ఫ్లోటింగ్‌ హౌజ్‌లో చెట్లకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సరస్సులోనే చేపలు పెంచుతారు. వారి అవసరాలకు సరిపోయే విధంగా తేలియాడే తోటలలో కూరగాయల సాగు చేస్తుంటారు.

14 సౌరఫలకాలు, ఫొటోవోల్టాయిక్‌ పవర్‌ జనరేటర్‌ ద్వారా ఫ్లోటింగ్‌ హౌజ్‌కి సరిపడే విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. దశాబ్ద కాలంలో ఆ ఇంటి నిర్మాణంలో చాలా మార్పులు చేశారు. వాళ్ల అభిరుచులు నెరవేర్చుకోవడానికి, అవసరాల కోసం ఇంటిని విస్తరించుకుంటూ పోయారు. ఎప్పుడు కలప దొరికితే అప్పుడే ఇంటి విస్తరణ చేస్తూ వచ్చారు. డ్యాన్స్‌ ఫ్లోర్‌, విశాలమైన కిచెన్‌, కోళ్ల గూడు, నీటిని శుద్ధిచేసే యంత్రం... ఇలా అన్ని వసతులూ అక్కడ చూడొచ్చు. 2013లో నెట్‌ కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఒడ్డుకు రాకపోకల కోసం ఒక చిన్న పడవను తయారుచేసుకున్నారు.

నిర్వహణ ఖర్చు ఎక్కువే

‘‘ఫ్లోటింగ్‌ హౌజ్‌ మొత్తం కలపతో చేసింది కాబట్టి అనుక్షణం నిప్పుతో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఏడాది వచ్చే శీతాకాలం తుపానులతో ఇల్లు దెబ్బతింటూ ఉంటుంది. ఆ సీజన్‌ తరువాత మళ్లీ ఇంటి పునరుద్ధరణ పనులు చేయాలి. చెక్కలు నీళ్లలో ఉన్న కారణంగా దెబ్బతింటూ ఉంటాయి. వాటిని మార్చాల్సి వస్తుంది’’ అంటారు కేథరిన్‌. అయితే గత ఏడాది ఆడన్స్‌ క్యాన్సర్‌తో చనిపోయారు. అయినా ఇంటిని వదిలిపెట్టేది లేదంటారామె.

ఈ వార్తలు కూడా చదవండి..

స్థిరంగా బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

కాంగ్రెస్ కీలక నేత హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 10 , 2025 | 08:20 AM