ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Butter Chicken: వెన్న లేకుండానే బటర్ చికెన్.. ఎలానో తెలుసుకోండి..

ABN, Publish Date - Jun 03 , 2025 | 01:17 PM

వెన్నతో చేసే చికెన్‌ను బటర్ చికెన్ అంటారు. అయితే, వెన్న లేకుండా కూడా రుచికరమైన బటర్ చికెన్ చేయొచ్చు. ఇందుకోసం కొన్ని చిట్కాలు పాటిస్తే చాలు.రెస్టారెంట్‌లో చేసినట్లు టేస్టీగా ఉంటుంది.

Butter Chicken

Butter Chicken: బటర్ చికెన్ అంటే తెలియని వారు ఉండరు. బటర్‌తో చేసే ఈ చికెన్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని రోటీస్, వెజ్ పులావ్ వంటి వాటిల్లో తింటే సూపర్‌గా ఉంటుంది. తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. అయితే, దీన్ని రెస్టారెంట్‌లో కాకుండా ఇంట్లోనే చేసుకుంటే హెల్తీగా కూడా ఉండవచ్చు. అయితే, కొంత మంది బటర్ తినడానికి ఇష్టపడరు. అలాంటి వారు కూడా బటర్ లేకుండానే బటర్ చికెన్ చేసుకోని కమ్మగా తినవచ్చు. అదేంటీ బటర్ లేకుండా బటర్ చికెన్ ఎలా చేస్తారు అనుకుంటున్నారా? ఇందుకోసం కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


వెన్నకు బదులుగా నూనె ఉపయోగించండి:

బటర్ చికెన్‌లో వెన్న వాడకూడదనుకుంటే మంచి నాణ్యత గల నూనె వాడండి. సన్ ఫ్లవర్ నూనె, బియ్యం ఊక నూనె లేదా కనోలా నూనె వాడవచ్చు. ఇవి మంచి రుచిని ఇస్తాయి. రుచికోసం తేలికపాటి ఆలివ్ నూనె లేదా ఆవ నూనె కూడా బాగుంటుంది. ఒక్క స్పూన్ వెన్న స్థానంలో 1.5 స్పూన్ల నూనె వేసుకుంటే సరిపోతుంది.

జీడిపప్పు లేదా బాదంపేస్ట్ వేసుకోండి

క్రీమీనెస్ కోసం జీడిపప్పు లేదా బాదంపేస్ట్ వేసుకోండి. వెన్న వేస్తే ఎలా టేస్ట్ వస్తుందో జీడిపప్పు లేదా బాదంపేస్ట్ వేస్తే అంతే టేస్ట్ వస్తుంది. దీని కోసం 8-10 జీడిపప్పు లేదా బాదం పప్పులను వేడి నీటిలో నానబెట్టి మెత్తగా పేస్ట్ చేయండి. టమోటా గ్రేవీతో దీనిని కలిపితే టేస్ట్ బాగుంటుంది.


రుచికరమైన మసాలా దినుసులు

వెన్న లేకపోయినా మంచి రుచికరమైన మసాలా దినుసులు వాడితే చికెన్‌ బాగా రుచి వస్తుంది. నిమ్మరసం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, గరం మసాలా వాడి, చికెన్‌ను కనీసం 30 నిమిషాలు మెరినేట్ చేయండి.

కొబ్బరి క్రీమ్

వెన్న కాకుండా కొబ్బరి క్రీమ్ వాడొచ్చు . ఇది సహజంగా తీపిగా ఉంటూ క్రీమీనెస్ ఇస్తుంది. వీటిని కర్రీ చివర్లో వేసి క్రీమీనెస్ వచ్చేలా చేయండి. పాల ఉత్పత్తులు తీసుకోకూడదనుకునేవాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.

మెంతి ఆకులు

చివరగా ఒక టీస్పూన్ ఎండిన మెంతి ఆకులు అరచేతిలో నలిపి కర్రీలో వేసేయండి. ఇది రెస్టారెంట్ స్టైల్ ఫ్లేవర్ ఇస్తుంది. పైగా కొద్దిగా చక్కెర లేదా తేనె వేసుకుంటే టమోటా ఆమ్లత తగ్గుతుంది. వెన్న టెస్ట్ ఎలా ఉంటుందో కర్రీ కూడా అలానే ఉంటుంది.

వెన్న లేకుండా బటర్ చికెన్ చేసేవాళ్లకు ఈ చిట్కాలు చాలా ఉపయోగపడతాయి. ఫ్లేవర్ ప్యాక్ అయిన పదార్థాలు వాడితే మీ వంటకు వెన్న లేకున్నా అసలైన రుచి ఉంటుంది. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రెసిపీ చిట్కాలతో మీరు కూడా రెస్టారెంట్ స్టైల్‌లో బటర్ చికెన్ ఇంట్లోనే వండేయవచ్చు..


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

మెదడు వాపు ఉన్నప్పుడు.. శరీరం ఈ 6 సంకేతాలను ఇస్తుంది..

అమ్మో.... మేనమామ సారెనా... మజాకా..

For More Lifestyle News

Updated Date - Jun 03 , 2025 | 01:22 PM