ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bathroom Camping: బాత్రూం క్యాంపింగ్.. జెన్ జీలో పెరిగిపోతున్న నయా ట్రెండ్..

ABN, Publish Date - Jul 14 , 2025 | 08:40 PM

జెన్ జీ అలవాట్లు, లైఫ్ స్టైల్ అన్నీ డిఫరెంటే. తాజాగా మరో ట్రెండ్‌కు నాంది పలికారు. అదే బాత్రూం క్యాంపింగ్. అంటే ఏం లేదండోయ్. నేటి యువత పని, చర్చలు, రిలాక్సేషన్ కోసం బాత్రూంనే ఆశ్రయిస్తున్నారు. ఏమంటే స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇంతకంటే బెస్ట్ ప్లేస్ మరొకటి లేదంటున్నారు. ఈ వాదనలో నిజమెంత? తెలుసుకుందాం పదండి.

Bathroom Camping

Gen Z Bathroom Camping: నేటి తరం ప్రతి వేగవంతమైన జీవనశైలిని అనుసరిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసు ఇలా ప్రతిచోటా అసైన్‌మెంట్లను గడువులోగా పూర్తి చేసే విషయంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇటువంటి వాతావరణం నుంచి తమను తాము ప్రశాంతంగా ఉంచుకునేందుకు Gen Z కొత్త మార్గం ఎంచుకున్నారు. ఒంటరిగా ఎక్కువ సమయం బాత్రూంలో గడిపేందుకు ఇష్టపడుతున్నారు. దీన్నే ప్రజలు సోషల్ మీడియాలో బాత్రూమ్ క్యాంపింగ్ అని పిలవడం ప్రారంభించారు. పని లేదా జనసమూహం నుంచి తప్పించుకునేందుకు నేటి యువత బాత్రూంలో కూర్చుని అలా మొబైల్‌లో తలదూర్చేస్తున్నారు.

జెన్ జెడ్ అంటే 1997- 2012 మధ్య జన్మించిన వాళ్లు. ఆఫీసు, కళాశాల లేదా సామాజిక వాతావరణం చాలా భారంగా అనిపించినప్పుడు వీళ్లు బాత్రూంకు వెళ్లి ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. బాత్రూంను 'సురక్షిత స్థలం'గా భావిస్తున్నారు. అక్కడ ఎటువంటి అంతరాయం లేదా తమను తాము రీసెట్ చేసుకోవచ్చనేది వాళ్ల ఆలోచన. కానీ, ఈ ధోరణి నేటి తరం వారి మానసిక ఆరోగ్యం ఎంత ప్రమాదంలో ఉందో సూచిస్తుంది.

బాత్రూమ్ క్యాంపింగ్ అంటే ఏమిటి?

బాత్రూమ్ క్యాంపింగ్. ఈ పదం కొంచెం వింతగా అనిపించవచ్చు. కానీ దీన్ని అర్థం చేసుకోవడం చాలా తేలిక. ఆఫీసు, కళాశాలలో లేదా రద్దీగా ఉండే ప్రదేశంలో అలసిపోయినప్పుడు Gen Z బాత్రూమ్‌కు వెళ్లి ఒంటరిగా కొంత సమయం గడుపుతారు. పని నుంచి లేదా ఇతరుల నుంచి విరామం తీసుకోవడానికి వాష్‌రూమ్‌లో కొన్ని నిమిషాలు గడుపుతారు. అక్కడ వారు మొబైల్‌లో సంగీతం వింటారు. యూట్యూబ్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ను స్క్రోల్ చేస్తారు, లేదా కొన్నిసార్లు గట్టిగా కళ్లు మూసుకుని సుదీర్ఘంగా శ్వాస తీసుకుంటారు.

బాత్రూమ్ క్యాంపింగ్ మంచిదేనా?

బాత్రూమ్ క్యాంపింగ్ అనేది ఒక కొత్త ట్రెండ్ అని అంటున్నారు. ఇది కొన్ని పట్టణ ప్రాంతాలలో ప్రారంభమైంది. బాత్రూమ్ క్యాంపింగ్‌లో కొన్ని నిమిషాల విరామం వారిని అంతర్గతంగా ప్రశాంతపరచి రీసెట్ చేస్తుంది. తద్వారా వారు మళ్లీ తమ బాధ్యతలపై దృష్టి పెట్టగలరు. ఈ తరం బాత్రూమ్‌ను సురక్షితమైన స్థలంగా, ఎవరూ జోక్యం చేసుకోని ప్రదేశంగా చూస్తోంది. ఈ ట్రెండ్ నేటి యువతరం భావోద్వేగ ఆరోగ్యానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో తెలియజేస్తుంది. ఈ పద్ధతి కొంత ఉపశమనం కలిగించినప్పటికీ మానసిక ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి ఏవైనా లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది.

బాత్రూమ్ క్యాంపింగ్ సమస్య ఎక్కడ ఉంది?

దీనికి మరో కోణం కూడా ఉంది. ఎవరైనా బయటి ప్రపంచం నుంచి దూరమవ్వాలని పదే పదే భావిస్తుంటే లేదా తనను తాను ఒంటరిగా చేసుకుంటుంటే ఇది కేవలం విరామం మాత్రమే కాదు. ఆందోళన, ఒత్తిడి, బర్నౌట్ లక్షణం అని డాక్టర్లు అంటున్నారు. అంటే బాత్రూమ్ క్యాంపింగ్ అనేది ఒక ట్రెండ్ మాత్రమే కాదు. ఒక వ్యక్తి మానసిక సమస్యలతో పోరాడుతున్నాడని కూడా సూచిస్తుంది.

Also Read:

రాత్రిపూట ఈ పేస్ట్ రాస్తే పింపుల్స్, బ్లాక్ హెడ్స్ పోతాయ్..

ఖాళీ కడుపుతో వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ తినాల్సిన పండ్లు ఇవే..!

For More Health News

Updated Date - Jul 14 , 2025 | 09:39 PM