Ashada Masam: ఆషాడ మాసం.. కొత్త కోడలిని పుట్టింటికి ఎందుకు పంపిస్తారో తెలుసా..
ABN, Publish Date - Jun 30 , 2025 | 11:22 AM
ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
Ashada Masam: ఆషాడ మాసం ప్రాధాన్యత గురించి మన పూర్వికులు ఎన్నో సంప్రదాయాలు, నమ్మకాలు చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం ఉంది. అయితే, అలా ఎందుకు పంపిస్తారో తెలుసా? ఈ నియమం వెనుక అసలు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మానసిక విశ్రాంతి కోసం
హిందూ ధర్మం ప్రకారం, కొత్త కోడలు ఈ మాసంలో అత్త ముఖం చూడకూడదు. ఈ నిబంధన వెనుక ఉన్న భావం ఏమిటంటే, కొత్తగా పెళ్లైన వధువులకి అత్తింట్లో కొంత ఒత్తిడి, ఆందోళనగా ఉంటుంది. కాబట్టి, వారికి మానసిక విశ్రాంతి కల్పించేందుకు, స్వేచ్ఛగా కొన్ని రోజులు గడిపేందుకు, అత్తింటి నుంచి తాత్కాలికంగా విరామం ఇవ్వడం కోసం ఆషాడ మాసంలో కొత్త కోడలిని పుట్టింటికి పంపించే సంప్రదాయం వచ్చింది.
పనుల్లో నిమగ్నమవ్వాలని
పూర్వం ఆషాడ మాసం అనేది వ్యవసాయ పనులకు చాలా కీలకమైన కాలం. అప్పట్లో పురుషులు పొలం పనుల్లో నిమగ్నమవుతూ ఇంటి విషయాలకు తక్కువ సమయం కేటాయించేవారు. అయితే, భార్యాభర్త కలసి ఉంటే ఆ వ్యక్తికి పనులపై దృష్టి తగ్గవచ్చని భావించి, తాత్కాలికంగా ఆషాడ మాసంలో భార్యను పుట్టింటికి పంపించే ఆచారం మొదలైంది.
ఆరోగ్య సమస్యలు
ఆషాడ మాసంలో గర్భం దాల్చినట్లయితే ప్రసవం వేసవికాలంలో జరుగుతుంది. వేసవిలో తల్లీ బిడ్డలకు ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని భావించి, ఈ మాసంలో దంపతులను వేరు వేరు ఉంచే సంప్రదాయాన్ని కొనసాగించారని చెబుతారు. అయితే, ఆధునిక సమాజంలో ఈ ఆచారాలు తక్కువగా పాటిస్తున్నారు. కానీ, దీని వెనుక ఉన్న కారణాలు తెలుసుకోవడం వల్ల మన పూర్వికుల దూరదృష్టిని అర్థం చేసుకోవచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)
Also Read:
గవర్నమెంట్ జాబ్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే విజయం మీదే..
ఫ్రెండ్స్ ఎక్కువగా ఉంటే ఇన్ని ఇబ్బందులా..
For More Lifestyle News
Updated Date - Jun 30 , 2025 | 01:42 PM