Share News

Vastu Tips: గవర్నమెంట్ జాబ్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే విజయం మీదే..

ABN , Publish Date - Jun 30 , 2025 | 10:25 AM

మీరు గవర్నమెంట్ జాబ్‌కు సిద్ధం అవుతున్నారా? అయితే, ఈ వాస్తు చిట్కాలు పాటిస్తే విజయం మీ సొంతం అవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Vastu Tips: గవర్నమెంట్ జాబ్‌కు సిద్ధం అవుతున్నారా.. ఈ వాస్తు టిప్స్ పాటిస్తే విజయం మీదే..
Government Job Preparation

Vastu Tips: నేటి కాలంలో ప్రభుత్వ ఉద్యోగం యువతకు కలగా మారింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతారు. కానీ, కేవలం అతి తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తున్నారు. ఇంకొంత మంది తాము ఎంత కష్టపడి చదివినా విజయం సాధించలేకపోతున్నామని చెబుతూ బాధపడుతుంటారు. అయితే, అలాంటి వారు ప్రభుత్వ ఉద్యోగ మార్గాన్ని సులభతరం చేసే ప్రభావవంతమైన వాస్తు చిట్కాలను పాటించాలని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


సరస్వతి చిత్రపటం

వాస్తు శాస్త్రం ప్రకారం, మీరు చదువుకునే ప్రతిసారీ మీ ముఖాన్ని ఉత్తరం లేదా తూర్పు వైపు ఉంచండి. ఈ దిశ సానుకూల శక్తిని పెంచుతుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచుతుంది. స్టడీ టేబుల్ ముందు గోడపై స్ఫూర్తినిచ్చే కోట్స్ లేదా సరస్వతి చిత్రపటాన్ని ఉంచండి.

గ్లోబ్ మ్యాప్ ఉంచండి..

ప్రభుత్వ ఉద్యోగంలో విజయం సాధించడానికి స్టడీ టేబుల్ మీద తాజా పసుపు పువ్వులు లేదా క్రిస్టల్ బాల్ ఉంచండి. ఇది బ్రహ్మ, సరస్వతి శక్తిని కలిగేలా చేస్తుంది. చదువుపై ఆసక్తిని మరింత పెంచుతుంది. ఎండిన పువ్వులను వెంటనే తీసివేయండి, లేకుంటే ప్రతికూల శక్తి వ్యాపిస్తుంది. వాస్తు ప్రకారం ఇంటి నైరుతి మూలను స్థిరత్వం, కెరీర్ మూలగా పరిగణిస్తారు. కాబట్టి, ఈ స్థలాన్ని క్లీన్‌గా ఉంచాలి.


దీపం వెలిగించి..

ఉదయం చదువుకునే ముందు దీపం వెలిగించి 'ఓం గణగణపతయే నమః' అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఈ మంత్రం అడ్డంకులను తొలగించి కెరీర్‌లో స్థిరత్వాన్ని తెస్తుందని నమ్ముతారు. వీలైతే, ఇంటి ప్రాంగణంలో లేదా బాల్కనీలో తులసి మొక్కను ఉంచండి.

సానుకూల ఆలోచన, శక్తి

మీ ఉద్యోగంలో పదే పదే అడ్డంకులు ఎదురవుతుంటే, శనివారం రావి చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగించి శని మంత్రాన్ని జపించండి. ఈ రోజున పేదవారికి ఇనుప వస్తువులు లేదా నల్లని దుస్తులను దానం చేయడం కూడా శుభప్రదం.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)

Also Read:

ఈ 5 అలవాట్లు పాటిస్తే.. వయస్సు పెరిగినా అందం తగ్గదు..

చర్మం, పాదాలపై కనిపించే ఈ లక్షణాలు విటమిన్ డి లోపానికి సంకేతమా..

For More Lifestyle News

Updated Date - Jun 30 , 2025 | 01:48 PM