AirPods Side Effects: ఎయిర్ పాడ్స్ యూజర్లు జాగ్రత్త.. మీరు కూడా ఈ తప్పు చేస్తే..
ABN, Publish Date - Jun 25 , 2025 | 05:15 PM
నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎయిర్ పాడ్స్ ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గంటల తరబడి వాటిని ఉపయోగిస్తున్నారు. అయితే..
AirPods Side Effects: నేడు ప్రతి ఒక్కరి జీవితంలో ఎయిర్ పాడ్స్ ఒక ముఖ్యమైన భాగంగా మారాయి. పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ గంటల తరబడి వాటిని ఉపయోగిస్తున్నారు. పని సమయంలో కాల్స్ నుండి వర్కౌట్స్ వరకు అవి చెవుల్లోనే ఉంటాయి. కానీ వాటిని ఎక్కువసేపు ఉపయోగించడం ప్రమాదకరమని మీకు తెలుసా? ఎయిర్ పాడ్స్ ని ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మీరు చెవిటివారు కూడా కావచ్చు.
ఇయర్‌ఫోన్‌లు, హెడ్‌ఫోన్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల వినికిడి నష్టం సంభవిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ.. వాల్యూమ్‌ను 70 dB కంటే తక్కువగా ఉంచాలని, ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు హెడ్‌ఫోన్‌లను ఉపయోగించకూడదని సిఫార్సు చేస్తోంది. ఇయర్‌ఫోన్‌లు, ఎయిర్ పాడ్స్ ఉపయోగిస్తున్నప్పుడు ఈ ముఖ్య విషయాలను గుర్తుంచుకోండి.
పరిమిత సమయం వరకు ఎయిర్ పాడ్స్ ఉపయోగించండి.
ఒకేసారి 60 నిమిషాల కంటే ఎక్కువసేపు వినియోగించకండి.
60% వాల్యూమ్‌ను మించకుండా చూసుకోండి.
ఎక్కువ వాల్యూమ్‌లో పాటలు లేదా కాల్స్ వినడం వల్ల చెవుల నరాలు దెబ్బతింటాయి.
మురికిగా ఉన్న ఇయర్‌ఫోన్‌లు చెవుల్లో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌కు కారణమవుతాయి.
నిద్రపోతున్నప్పుడు లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు ఎయిర్ పాడ్స్ పెట్టుకోకూడదు.
నిద్రపోతున్నప్పుడు ఇయర్‌ఫోన్‌లు వాడటం వల్ల చెవులపై ఒత్తిడి ఏర్పడవచ్చు.
వ్యాయామం చేస్తున్నప్పుడు వైర్‌లెస్ ఇయర్‌ఫోన్‌లు పడిపోవడం లేదా చెవుల్లో ఇరుక్కుపోవడం వంటి ప్రమాదం ఉంది.
ఇతరుల ఇయర్‌ఫోన్, ఎయిర్ పాడ్స్ వాడటం మంచిది కాదు.
నాణ్యత లేని ఇయర్‌ఫోన్‌లు లేదా ఎయిర్ పాడ్స్ వల్ల విద్యుత్ షాక్ కలిగించవచ్చు.
అవసరానికి మాత్రమే ఉపయోగించండి. అదే పనిగా వాడటం చెవి ఆరోగ్యానికి ప్రమాదం.
Also Read:
బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
టాటూ ఉన్న వాళ్లు రక్తదానం చేయడం మంచిదేనా..
For More Lifestyle News
Updated Date - Jun 25 , 2025 | 05:15 PM