Share News

Health Tips: బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..

ABN , Publish Date - Jun 24 , 2025 | 05:16 PM

కొంతమంది రోజంతా కూడా చాలా బద్ధకంగా ఉంటారు. వీరికి ఏ పని చేయాలని అనిపించదు. అయితే, ఈ బద్దకానికి కారణం.. కొన్ని ఆహార పదార్థాలేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మరి ఆహారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Health Tips: బద్దకానికి కారణమయ్యే ఆహారాలు ఇవే..
Laziness

Laziness: మన చుట్టూ ఉన్న వాళ్లలో కొంత మంది చాలా బద్దకంగా ఉంటుంటారు. ఎలాంటి పని చేయాలన్నా ఉత్సాహం లేకపోవడం, ఏ పనిలోనూ ఫోకస్ పెట్టలేకపోవడం, శారీరకంగా అలసిపోయినట్లుగా కనిపిస్తుంటారు. అయితే ఈ బద్దకానికి కారణం జీవనశైలి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అవును, మన అలవాట్లు, మనం తినే ఆహారం.. బద్దకాన్ని ప్రేరేపిస్తుందట. మనం రోజూ తినే కొన్ని ఆహారాలు శరీరంలో ఉత్సాహాన్ని తగ్గించడంతో పాటు, బద్దకాన్ని పెంచేలా పనిచేస్తాయట. మరి అవేమిటో ఈ కథనంలో తెలుసుకుందాం..


బేకరీ ఐటమ్స్..

బేకరీ ఐటమ్స్ బ్రెడ్, కేక్, పఫ్ వంటివి వ్యక్తులను బద్దకస్తులుగా మార్చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బేకరీ పదార్థాల్లో అధికంగా ఉండే రిఫైన్‌డ్ కార్బోహైడ్రేట్లు, షుగర్ శరీరానికి తాత్కాలికమైన శక్తిని ఇస్తాయిగానీ, కాసేపటికే అలిసిపోయిన భావనను కలిగిస్తాయి. ఈ పదార్థాలు మెదడుపై ప్రభావం చూపి బద్ధకాన్ని పెంచుతాయి.

అధిక కెఫిన్ తీసుకోవడం..

కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తాగితే రిలాక్స్, రిఫ్రెష్ అనిపిస్తుంది. అయితే, ఎక్కువగా తీసుకుంటే మాత్రం నిద్రలేమి సమస్య, మెటబాలిజం మందగించటం వంటి సమస్యలు వస్తాయి. చివరికి శారీరక అలసటకు దారి తీస్తాయి.

చెర్రీస్..

చెర్రీస్‌లో మెలటోనిన్ పదార్థం ఉంటుంది. ఇది నిద్రకు కారణమయ్యే హార్మోన్‌ను ప్రేరేపిస్తుంది. దీనిని సాయంకాలం, రాత్రి తినడం వల్ల ప్రయోజనం ఉన్నప్పటికీ.. పని చేసే సమయంలో తింటే మాత్రం నిద్రగా, బద్దకంగా ఫీలవుతారు. అందుకే.. వీటిని సాయంత్రం తర్వాత తీసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ప్రాసెస్‌డ్ ఫుడ్స్..

పాస్తా, పిజ్జా లాంటి ప్రాసెస్‌డ్ ఫుడ్స్ జీర్ణక్రియను మందగించేందుకు కారణమవుతాయి. వీటిని అధికంగా తినడం వల్ల పనిచేయాలన్న ఉత్సాహం తగ్గుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాలు క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, హృదయ సంబంధిత వ్యాధులకు కారణమవుతాయి.

వేయించిన పదార్థాలు..

నూనెలో బాగా వేయించిన ఆహార పదార్థాలు శరీరాన్ని తక్కువ ఎనర్జీకి పరిమితం చేస్తాయి. ఫ్రైడ్ ఫుడ్స్ తిన్న వెంటనే నిద్ర మత్తుగా అనిపిస్తుంటుంది. బద్దకాన్ని పెంచుతుంది.


బద్దకాన్ని తగ్గించాలంటే?

  • తాజా పండ్లు, కూరగాయలు తీసుకోండి.

  • శరీరానికి తేలికగా ఉండే ఆహారం, ప్రొటీన్లు తీసుకోండి.

  • పుష్కలంగా నీరు తాగండి.

  • రోజూ 15-30 నిమిషాల వ్యాయామం చేయండి.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

మిలమిల మెరిసే తెల్లటి దంతాల కోసం బేకింగ్ సోడా వాడవచ్చా..

పళ్ల చిగుళ్లు ఎందుకు ఉబ్బుతాయి? నివారణకు ఏం చేయాలి?

For More Health News

Updated Date - Jun 24 , 2025 | 06:06 PM