Share News

మిలమిల మెరిసే తెల్లటి దంతాల కోసం బేకింగ్ సోడా వాడవచ్చా..

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:12 PM

How to Whiten Your Teeth Naturally: దంతాల పసుపు రంగు కారణంగా ప్రజలు తరచుగా ఇబ్బంది పడతారు. దీన్ని బేకింగ్ సోడాతో ఈజీగా వదిలించుకోవచ్చని నెట్టింట్లో కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు సలహా ఇస్తుంటారు. ఇంతకీ, దంతాలు తెల్లగా మెరిసిపోయేందుకు బేకింగ్ సోడా చిట్కా వాడవచ్చా? డాక్టర్లు ఏమని సూచిస్తున్నారు.

మిలమిల మెరిసే తెల్లటి దంతాల కోసం బేకింగ్ సోడా వాడవచ్చా..
Baking Soda for Teeth

Pros and Cons of Brushing Teeth with Baking Soda: ఆహారపు అలవాట్లు, ధూమపానం, మద్యపానం తదితర కారణాల వల్ల ప్రజలు తరచుగా దంత సమస్యలతో బాధపడుతుంటారు. అందులో దంతాల పసుపురంగులో ఉండటం ఒకటి. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు నలుగురిలో హాయిగా చిరునవ్వు నవ్వేందుకు సంశయిస్తుంటారు. బ్లీచింగ్ వంటి చికిత్సలు తీసుకున్నా కొన్నిసార్లు సమస్య తిరగబెడుతూ ఉంటుంది. కొంతమందేమో ప్రతిసారీ వైద్యుడి దగ్గరకు వెళ్లి జేబుకు చిల్లు పెట్టుకోవడం ఎందుకని భావిస్తుంటారు. అందుకని మెరిసే దంతాల కోసం తెలిసిన చిట్కాలన్నీ ఫాలో అవుతుంటారు. ఈ మధ్య బేకింగ్ సోడాతో తెల్లటి దంతాలు ఖాయమంటూ కొందరు ఇన్‌ఫ్లూయెన్సర్లు నెట్టింట్లో సలహాలు ఇస్తున్నారు. ఇంతకీ, ఈ చిట్కా నిజంగా మన దంతాలను మెరిపిస్తుందా?


బేకింగ్ సోడా (సోడియం బైకార్బోనేట్) అనేది తెల్లటి పొడి. దీనిని సాధారణంగా వంట కోసం, శుభ్రపరచడానికి ఉపయోగిస్తారు. నిజానికి వంటసోడా మన దంతాలపై ఉన్న పేరుకుపోయిన పాచిని శుభ్రం చేసేందుకు సమర్థంగా పనిచేస్తుంది. దంతాల శుభ్రత కోసం ఈ చిట్కా ఉపయోగించడంలో తప్పులేదు. కానీ, దీనిని చాలా పరిమిత పరిమాణంలో ఉపయోగించాలి. నెలకు ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే. ప్రతిరోజూ దీన్ని వాడటం చాలా హానికరం.


బేకింగ్ సోడా దంతాలకు ఎందుకు హానికరం?

బేకింగ్ సోడాతో నిరంతరం దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల చిగుళ్ల సున్నితమైన చర్మం దెబ్బతింటుందని డాక్టర్లు అంటున్నారు. చిగుళ్ళు బలహీనంగా మారడం వల్ల చిగుళ్ళు వాటి స్థానం నుండి కదలడం ప్రారంభిస్తాయి. దీనివల్ల దంతాలు విరిగిపోయే ప్రమాదం ఉంది. అదీగాక వంటసోడా దంతాలపై ఉండే ఎనామిల్‌ను దెబ్బతీస్తుంది. ఇది బేకింగ్ సోడా కారణంగా అరిగిపోయే ప్రమాదముంది. ఇలా జరిగితే గనక వేడి లేదా చల్లని ఆహారం తిన్నప్పుడు దంతాలు జివ్వుమంటాయి. నొప్పి సహా అనేక ఇతర సమస్యలు రావచ్చు.


నోటి pH స్థాయి క్షీణించడం

బేకింగ్ సోడా ఒక ఆమ్ల పదార్థం. దీనిని రోజూ లేదా తరచూ వాడటం వల్ల నోటి సహజ ఆమ్ల-క్షార సమతుల్యత దెబ్బతింటుంది. pH స్థాయిలో తేడాలు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలకు కారణమవుతాయి.


సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఏమిటి?

  • దంతవైద్యుడి సలహా ప్రకారమే టూత్‌పేస్ట్‌ ఎంచుకోండి.

  • సంవత్సరానికి ఒకసారి ప్రొఫెషనల్ క్లీనింగ్ చేయించుకోండి.

  • వేప, అకాసియా టూత్ బ్రష్ లేదా ఆయుర్వేద పేస్ట్ కూడా ఎంపిక చేసుకోవచ్చు.


(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

వయసు కాదు.. ఈ అలవాట్లే కీళ్ల నొప్పులు, మోకాలి నొప్పులకు కారణం..!

పదే పదే దగ్గడం.. గుండె జబ్బులకు సంకేతమా ..

For More Health News

Updated Date - Jun 24 , 2025 | 12:42 PM