Arguments to Avoid: జీవితం ప్రశాంతంగా సాగాలంటే.. వివేకవంతుల్లా ఈ 5 రకాల వాదనలకు దూరంగా ఉండండి..
ABN, Publish Date - Jun 25 , 2025 | 08:20 AM
Arguments to avoid in life for Peace: కెరీర్ ఎదుగుదలకు కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నా.. టెన్షన్ లేని ప్రశాంత జీవితం పొందాలన్నా ఈ కింది విషయాలకు దూరంగా ఉండాల్సిందే అని సూచిస్తున్నారు నిపుణులు. ఈ 5 రకాల చర్చలకు దూరంగా ఉండటం వల్లే వివేకవంతులు నలుగురిలో మన్ననలు అందుకోవడంతో పాటు ది బెస్ట్ అనిపించుకుంటారని అంటున్నారు.
Arguments wise people avoid: అందమైన టెన్షన్ లేని జీవితం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో ఎదురయ్యే కొన్ని తగాదాలు, వాదనలు, చర్చలకు దూరంగా ఉండాలి. అప్పుడే మీ లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది. కానీ, నేటికాలంలో చాలామంది సరైన కమ్యూనికేషన్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేకపోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకునే విషయంలో తడబాటు పడుతున్నారు. ఒత్తిడి, కోపం, అసహనం, నిరాశకు గురై అసంతృప్తితో బతుకులీడుస్తున్నారు. ఇలాంటి వారిని మీ చుట్టూ ఎందరినో చూసే ఉంటారు. నా ఒత్తిడి సమస్యలకు పరిష్కారమే దొరకదని భావించి పిరికిపందల్లా పారిపోకుండా ఈ 5 రకాల వాదనలకు దూరంగా ఉండండి. వివేకవంతులు ఇలాంటి వాటిలో తలదూర్చకపోవడం వల్లే వాళ్లు గొప్పవాళ్లుగా సమాజంలో గుర్తింపు పొందుతారు. అవేంటో చూద్దాం.
జ్ఞానులు ఎప్పుడూ ఈ 5 రకాల వాదనలకు దూరంగా ఉంటారు. ఎందుకంటే, ఈ రకమైన వాదనలు మీ సమయం, శక్తిని వృథా చేయడమే కాకుండా ఒత్తిడిని పెంచుతాయి. తద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది. అకారణంగా అందరినీ దూషిస్తూ గొడవలకు దిగేందుకు అలవాటు పడతారు. నిత్యం చికాకుతో ఇంటా బయటా ఛీత్కారాలకు గురవుతారు. కాబట్టి, తెలివైనవాళ్లలాగే మీరూ ఈ కింది 5 వాదనలకు దూరంగా ఉండండి.
మతంపై చర్చ
జ్ఞానులు మరొకరి మతం, వ్యక్తిగత నమ్మకాలకు సంబంధించిన అంశాల గురించి ఎప్పుడూ వాదించరు. ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉండే ఇలాంటి సున్నితమైన విషయాల్లో తలదూర్చితే సంబంధ బాంధవ్యాలు దెబ్బతింటాయని వారికి తెలుసు. మంచో.. చెడో.. ఏదైనా సరే. ఈ అంశంపై వాదించడం వల్ల ఫలితం ఉండకపోవచ్చని ఊహించడమే కారణం.
రాజకీయ చర్చలు
తెలివైన వ్యక్తులు ఎల్లప్పుడూ రాజకీయాలకు సంబంధించిన అంశాలపై చర్చించకుండా ఉంటారు. ఇలాంటి సమస్యలు తరచుగా సమయం వృథా చేయడంతో పాటు ఆయా వ్యక్తుల మధ్య ఉద్రేకాలను రేకెత్తిస్తాయి. వాగ్వాదంలో మాదే పై చేయి కావాలనే తలంపుతో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తారు. కొన్నిసార్లు తీవ్ర గొడవలకు కూడా దారితీయవచ్చు. ఇటువంటి చర్చలు మీ మానసిక ప్రశాంతతను చెడగొట్టి ఒత్తిడిని పెంచుతాయి. కాబట్టి, ఈ అంశంపై దూరంగా ఉండటం మంచిది.
ఆన్‌లైన్ చర్చ
సోషల్ మీడియాలో చాలామంది అవతలి వ్యక్తి నేరుగా కనిపించకపోవడం వల్ల మనసుకు తోచినట్టుగా మాట్లాడేస్తుంటారు. ఇక కామెంట్ సెక్షన్‌లో దారుణాతి దారుణంగా ట్రోల్స్ చేయడం, అసభ్య పదజాలంతో తిట్టడం, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసేస్తుంటారు. విజేతలు ఎప్పుడూ ఈ తరహా మనస్తత్వం కలిగి ఉండరు. ఇలాంటి చర్చల వల్ల కలిగే ఫలితం శూన్యమని వారికి బాగా తెలుసు. అందుకే వారి జీవితంలోని అమూల్యమైన క్షణాలను ఇలాంటి తుచ్ఛమైన వ్యాఖ్యలు పెట్టేందుకు వెచ్చించరు.
తప్పుపట్టడం
తెలివైన వ్యక్తులు ఎప్పుడూ కూడా అవతలి వ్యక్తుల్లోని లోపాలు, బలహీనతలు గుర్తించడాన్ని పనిగా పెట్టుకోరు. నిత్యం అవతలి వ్యక్తిలోని చిన్న తప్పులను ఎత్తిచూపే లక్షణం మానసిక దౌర్భల్యానికి ప్రతీక అని వీరికి తెలుసు. ఇలా చేయడం వల్ల వ్యక్తుల మధ్య సంబంధాలు దెబ్బతిని శత్రుత్వానికి దారితీస్తుంది. అందుకే ఒక వ్యక్తిని ఎప్పుడూ కించపరిచేలా మాట్లాడుతూ సమయాన్ని వృథా చేసుకునేందుకు ఇష్టపడరు.
సరైనవాడని నిరూపించుకునేందుకు
ఉన్నత ఆలోచనలు, ఆశయాలు కలిగిన వివేకవంతులు తాము సరైనవారని నిరూపించుకోవాల్సిన అవసరం లేదనే అనుకుంటారు. తప్పులను అవతలివారిపైకి నెట్టేసి సమస్యల నుంచి తప్పించుకునే ఆలోచనలు చేయరు. అవతలి వ్యక్తులను కించపరచడం, వారి పొరపాట్లను ఎత్తి చూపడంలో ఆనందం పొందరు. ఇతరులు చెప్పే చాడీలను చెవిలో పెట్టుకోరు. గాసిప్‌లతో తమ సమయాన్ని వృథా చేసుకోరని అంటున్నారు నిపుణులు.
Also Read:
ఇంట్లో అతి ఖర్చులు.. ఇలా కంట్రోల్ చేయండి..
ఈ రంగు చెప్పులు వేసుకుంటున్నారా.. జాగ్రత్త.. దురదృష్టం వెంటాడుతుంది..
For More Lifestyle News
Updated Date - Jun 25 , 2025 | 03:35 PM