ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Putin Talks: త్వరలో ట్రంప్, పుతిన్ భేటీ.. ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు సాధ్యమా

ABN, Publish Date - Aug 07 , 2025 | 04:46 PM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య త్వరలో కీలక సమ్మిట్ జరగబోతోంది. అయితే ఈ భేటీ ఎప్పుడు, ఎక్కడ జరుగుతుందనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఈ భేటీ ద్వారా ఉక్రెయిన్- రష్యా యుద్ధం ముగుస్తుందా లేదా అనే విషయాలను ఇక్కడ చూద్దాం.

Trump Putin Talks

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో త్వరలో ఒక సమ్మిట్‌లో భేటీ (Trump Putin Talks) కానుంది. ఈ వార్త క్రెమ్లిన్ నుంచి వచ్చింది. కానీ ఈ భేటీ ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందన్నది మాత్రం ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. కానీ, వచ్చే వారంలో ఈ భేటీ జరిగే అవకాశం ఉందని క్రెమ్లిన్ సలహాదారు యూరి ఉషాకోవ్ అన్నారు. రష్యా, అమెరికా బృందాలు కలిసి ఈ సమావేశం కోసం ప్లాన్‌ సిద్ధం చేస్తున్నాయి.

యుద్ధం ఆపేందుకు..

ఎందుకంటే, రష్యా-ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలకాలని ట్రంప్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. బుధవారం ట్రంప్ తన సన్నిహితులతో ఒక కాల్‌లో ఈ సమ్మిట్ గురించి చర్చించారు. అందులో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కూడా ఉన్నారు. ట్రంప్ ఈ కాల్‌లో చాలా పాజిటివ్‌గా మాట్లాడారని, యుద్ధాన్ని ఆపేందుకు ఒక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని చెప్పారట.

ముగ్గురూ కలిసి

అయితే ఈ సమావేశంలో ఏం జరగబోతోంది? ట్రంప్ టీమ్ నుంచి స్టీవ్ విట్‌కాఫ్ అనే ప్రతినిధి పుతిన్‌తో దాదాపు మూడు గంటలు మాట్లాడారు. ఈ చర్చల్లో ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన వచ్చింది. పుతిన్, ట్రంప్, జెలెన్‌స్కీ ముగ్గురూ కలిసి ఒక ట్రైలాటరల్ మీటింగ్ చేయాలని.. కానీ, ఇంకా ఈ ఆలోచనపై స్పందించలేదన్నారు. ప్రస్తుతానికి పుతిన్-ట్రంప్ ద్వైపాక్షిక భేటీపైనే ఫోకస్ చేస్తున్నట్లు చెప్పారు.

భూ భాగాల గురించి..

ట్రంప్ ఇంకా ఏం చెప్పారంటే, పుతిన్, జెలెన్‌స్కీలతో తాను త్వరలోనే మాట్లాడే అవకాశం ఉందన్నారు. శాంతి చర్చలకు మంచి ఛాన్స్ ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఆలోచన కూడా పంచుకున్నారు. భూ భాగాల గురించి చర్చించడం ద్వారా శాంతి ఒప్పందం కుదరవచ్చని.. అంటే, కొన్ని భూభాగాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఒప్పందం కుదురుతుందా..

అయితే, ఈ ఒప్పందం అంత ఈజీ కాదు. రష్యా ఆయిల్ కొనే దేశాలపై ట్రంప్ సెకండరీ టారిఫ్‌లు విధిస్తామని బెదిరించారు. శుక్రవారం లోపు యుద్ధాన్ని ఆపకపోతే ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు. ఇది రష్యాపై ఒత్తిడి పెంచే ప్రయత్నంలా కనిపిస్తోంది. ఈ భేటీ ఫలితంగా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? శాంతి ఒప్పందం కుదురుతుందా? ఇవన్నీ తెలియాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 07 , 2025 | 04:47 PM