ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Machado Criticism: ఆమెకు నోబెల్ బహుమతి ఇవ్వడం సిగ్గుమాలిన చర్య.. మచాడోపై విమర్శల వెల్లువ

ABN, Publish Date - Oct 11 , 2025 | 07:10 PM

నోబెల్ బహుమతి గ్రహీత, వెనిజులా ప్రతిపక్ష నేత మచాడోపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. వామపక్ష భావజాలాన్ని వ్యతిరేకించే పాశ్చాత్య ధోరణికి ఆమె ఎంపిక నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు.

María Corina Machado criticism

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతిని వెనిజులా ప్రతిపక్ష నేత మరియా కొరీనా మచాడో దక్కించుకున్నారు. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఆమె ప్రజాస్వామ్య విలువలకు ప్రతిరూపమని నోబెల్ కమిటీ ప్రశంసల వర్షం కురిపించింది. అయితే, ట్రంప్‌ను అధిగమించి నోబెల్‌ను దక్కించుకున్న ఆమెపై ప్రస్తుతం విమర్శలు కూడా చెలరేగుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థులతోపాటు వామపక్ష వాదులు, అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆమెను తూర్పారబడుతున్నాయి (Machado Criticism- Reasons).

వెనిజులా వ్యవహారాల్లో విదేశీ శక్తుల జోక్యానికి మచాడో మద్దతు పలికారంటూ వామపక్షవాదులు ఆమెపై దుమ్మెత్తిపోస్తున్నారు. సొంత దేశంపై విదేశీయుల ఆంక్షలకు ఆమె వంతపాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కౌన్సిల్ ఆన్ అమెరికన్-ఇస్లామిక్ రిలేషన్స్ సంస్థ మచాడోపై అగ్గిమీద గుగ్గిలమైంది. గాజాలో మానవ హననానికి కారణమైన ఇజ్రాయెలీ లికుడ్ పార్టీకి మచాడో మద్దతు పలికారని ఆరోపించింది. ఐరోపాతోపాటు అమెరికాలోని సంప్రదాయవాద వర్గాల ఎజెండాను ప్రోత్సహించారని ఆరోపించింది.

స్పెయిన్ మాజీ వైస్ ప్రెసిడెంట్ పాబ్లో ఇగ్లిసియాస్‌ కూడా మచాడోపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమెకు శాంతి బహుమతి ఇవ్వడంపై మండిపడ్డారు. ఈ చర్య.. ట్రంప్ లేదా హిట్లర్‌ను గౌరవించడంతో సమానమని వ్యాఖ్యానించారు

ఇక వెనిజులా చట్టసభల సభ్యులు కూడా మచాడోపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమెకు శాంతి బహుమతి ఇవ్వడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు ఆమె మద్దతునిచ్చారని మండిపడ్డారు. పాశ్చాత్య దేశాల వామపక్ష భావజాల వ్యతిరేకతకు ఈ ఉదంతం అద్దం పడుతోందని అన్నారు.

నోబెల్ బహుమతి కమిటీ మాత్రం మచాడోపై ప్రశంసలు కురిపించింది. చీకటి అలుముకున్న దేశంలో ప్రజాస్వామ్య జ్వాలను రగిలించిన వ్యక్తి అంటూ ఆమెను కీర్తించింది. వెనిజులా ప్రతిపక్షాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొంది. ప్రజాస్వామ్య సాధనాలే శాంతి నెలకొల్పేందుకు అసలైన మార్గాలనే విషయాన్ని ఆమె పోరాటం రుజువు చేసిందని వ్యాఖ్యానించింది. భవిష్యత్తుపై ఆశ, ప్రాథమిక హక్కుల రక్షణ, బలహీనుల వాణిని బలంగా వినిపించే గొంతుకకు మచాడో ప్రతిబింబమని పేర్కొంది.

ఇవి కూడా చదవండి:

అలా కావాలని చేయలేదు.. డిల్లీ ప్రెస్‌మీట్‌లో మహిళలా జర్నలిస్టులు లేకపోవడంపై తాలిబాన్ల వివరణ

మా పాత్ర ఏమీ లేదు.. అప్ఘాన్ ప్రెస్ మీట్‌పై కేంద్రం వివరణ

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 11 , 2025 | 08:40 PM