ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Trump Tariffs India: భారత్‌పై మీరూ ఆంక్షలు విధించండి.. ఐరోపా దేశాలకు అమెరికా సూచన

ABN, Publish Date - Aug 31 , 2025 | 08:27 AM

భారత్‌పై ఆంక్షలు విధించాలని అమెరికా ఐరోపా దేశాలను అభ్యర్థించినట్టు తెలుస్తోంది. అయితే.. ఐరోపా దేశాలు ఈ విషయంలో ఇప్పటివరకూ ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదు.

White House India Tariffs Request

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌పై ఐరోపా దేశాలు కూడా ఆంక్షలు విధించాలని శ్వేత సౌధం కోరినట్టు తెలిసింది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. భారత్‌ నుంచి చమురు, సహజ వాయువు కొనుగోళ్లను పూర్తిగా నిలిపివేయాలని, అమెరికా తరహాలో ఆంక్షలు విధించాలని శ్వేత సౌధం కోరినట్టు తెలిసింది. రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయని పక్షంలో రెండో దశ సుంకాలను విధించాలని కూడా సూచించినట్టు సమాచారం.

తమపై 50 శాతం సుంకం విధించడాన్ని భారత్ తొలి నుంచీ వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. రష్యా చమురును అత్యధికంగా కొనుగోలు చేస్తున్న చైనాను వదిలి తమపై సుంకాలు విధించడం ఏంటని భారత్ ప్రశ్నిస్తోంది. ఐరోపా దేశాలు కూడా రష్యా సహజవాయువును కొనుగోలు చేస్తున్న తీరును భారత్ లేవనెత్తింది.

ఇక రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగించాలన్న ట్రంప్ ప్రయత్నాలకు కొందరు ఐరోపా నేతలు బహిరంగంగా మద్దుతు పలుకుతూ తెర వెనుక మాత్రం పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని శ్వేత సౌధం వర్గాలు భావిస్తున్నాయి. రష్యా చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా మండిపడుతున్నా ఐరోపా దేశాలు మాత్రం మౌనం వహించాయి. ట్రంప్ సుంకాల విధింపునకు బహిరంగంగా ఎలాంటి మద్దతు ప్రకటించలేదు. ‘ఐరోపా నేతల విషయంలో శ్వేత సౌధం సహనం నశిస్తోంది’ అని ఓవల్ ఆఫీసు ఉన్నతాధికారి ఒకరు కామెంట్ చేశారు. మరింత మెరుగైన డీల్ కోసం వేచి చూడాలని ఉక్రెయిన్ అధ్యక్షుడిని తెర వెనక ఉండి ఐరోపా దేశాలు ప్రోత్సహిస్తున్నట్టు వైట్ హౌస్ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ.. షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో పాల్గొనేందుకు చైనాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనా, రష్యా అధ్యక్షులతో ప్రత్యేకంగా చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చర్చల్లో ట్రంప్ సుంకాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రధాన అంశాలుగా ఉండనున్నాయని సమాచారం.

ఇవి కూడా చదవండి:

తనను నోబెల్‌కు సిఫారసు చేయలేదనే.. ట్రంప్‌పై న్యూయార్క్‌ టైమ్స్ సంచలన కథనం

అమెరికాకు అన్ని పోస్టల్‌ పార్శిళ్లు బంద్‌.. భారత్ నిర్ణయం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 31 , 2025 | 01:28 PM