ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మిలిటరీ పరేడ్‌కు మునీర్‌ను పిలవలేదు

ABN, Publish Date - Jun 15 , 2025 | 06:15 AM

అమెరికా మిలిటరీ పరేడ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను వైట్‌హౌస్‌ అధికార వర్గాలు ఖండించాయి.

  • ముఖ్య అతిథిగా పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ను పిలిచారన్న వార్తలపై అమెరికా

వాషింగ్టన్‌, జూన్‌ 14 : అమెరికా మిలిటరీ పరేడ్‌కు పాకిస్థాన్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ను ఆహ్వానించినట్టు వచ్చిన వార్తలను వైట్‌హౌస్‌ అధికార వర్గాలు ఖండించాయి. మునీర్‌ సహా ఏ విదేశీ నేతనూ పరేడ్‌ కోసం ఆహ్వానించలేదని వివరణ ఇచ్చాయి. అమెరికా మిలిటరీ పరేడ్‌ 250వ వార్షిక వేడుకను వాషింగ్టన్‌లో జూన్‌ 14న (అమెరికా కాలమానం ప్రకారం) నిర్వహించనున్నారు.

అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ 79వ జన్మదిన సందర్భం కూడా దీనికి కలిసివచ్చింది. దీంతో ఈసారి పరేడ్‌ను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. ఈ పరేడ్‌కు ముఖ్య అతిథిగా పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ను ఆహ్వానించినట్టు దక్షిణాసియాకు చెందిన మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌ స్పందించింది. మునీర్‌కు ఆహ్వానంపై వచ్చిన వార్తలన్నీ ఊహాగానాలేనని తేల్చేసింది. భారత్‌కు తమ మద్దతు ఉంటుందని తెలిపింది.

Updated Date - Jun 15 , 2025 | 06:16 AM