ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Jaishankar Strong Reply To US: రష్యా చమురు తీసుకుంటే భారత్‎పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్

ABN, Publish Date - Jul 03 , 2025 | 03:37 PM

అమెరికా కాంగ్రెస్‌లో లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టిన రష్యా ఆంక్షల బిల్లు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) దీనిపై స్పందించారు.

Jaishankar

వాషింగ్టన్‌: అమెరికా కాంగ్రెస్‌లో కొత్త రష్యా ఆంక్షల బిల్లు గురించి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ (Jaishankar) స్పందించారు. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రవేశపెట్టారు. రష్యా 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన తర్వాత కూడా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్న దేశాలపై ముఖ్యంగా భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ బిల్లు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపవచ్చనే ప్రశ్నకు జైశంకర్, ఆ సమయం వచ్చినప్పుడు దానిని ఎదుర్కొంటామన్నారు.

బిల్లు గురించి వివరాలు

లిండ్సే గ్రాహం మాట్లాడుతూ ఈ బిల్లు రష్యా యుద్ధ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచడం, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను ఉక్రెయిన్‌తో చర్చలకు రప్పించడం లక్ష్యంగా ఉందన్నారు. ఈ బిల్లు రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలు విధిస్తుంది. ఈ క్రమంలో భారత్, చైనా వంటి దేశాలు పుతిన్ యుద్ధ కార్యకలాపాలకు సహాయపడుతున్నాయని వ్యాఖ్యానించారు. అయితే, ఈ బిల్లును అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదించాలా, వద్దా? అనే నిర్ణయం తీసుకోనున్నారు.

భారత్‌పై ప్రభావం

పాశ్చాత్య దేశాల ఆంక్షల నేపథ్యంలో భారత్, చైనా వంటి దేశాలు రష్యా నుంచి తక్కువ ధరకు చమురు కొనుగోలు చేస్తున్నాయి. భారత్, ప్రపంచంలో మూడో అతిపెద్ద చమురు దిగుమతి, వినియోగ దేశంగా ఉంది. మధ్యప్రాచ్యం నుంచి చమురు దిగుమతి చేసుకునే భారత్.. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత రష్యా నుంచి చమురు కొనుగోళ్లను పెంచింది. రష్యా చమురు తక్కువ ధరకు లభ్యం కావడంతో భారత్ దిగుమతులు 1 శాతం నుంచి 40-44 శాతానికి పెరిగాయి.

ఇప్పటికే రష్యా నుంచి..

జూన్‌లో రష్యా నుంచి భారత్ రోజుకు 2-2.2 మిలియన్ బ్యారెల్స్ చమురు దిగుమతి చేసుకుంది. ఇది గత రెండేళ్లలో అత్యధికం. ఒకవేళ ఈ బిల్లు అమలులోకి వస్తే అమెరికాకు దిగుమతి అయ్యే భారత ఉత్పత్తులపై 500 శాతం సుంకాలు విధించే అవకాశం ఉంది. భారత్ ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియలో ఉంది. ఇది సుంకాలను గణనీయంగా తగ్గించనుంది. ఈ బిల్లు భారత్ పై ప్రభావం చూపితే, దానిని పరిశీలిస్తామని జైశంకర్ వాషింగ్టన్‌లో అన్నారు. సమయం వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..

పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి గుడ్ న్యూస్..


మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 03 , 2025 | 04:22 PM