ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India Pak Tensions: ఇండియా, పాక్ యుద్ధం.. అమెరికా ఉపాధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - May 09 , 2025 | 07:21 AM

India Pak Tensions: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, పాక్ యుద్ధంపై స్పందించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అన్నారు.

India Pak Tensions

భారత్, పాకిస్తాన్‌ల మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. యుద్ధం మధ్యలో తాము కలుగజేసుకోమని స్పష్టం చేశారు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పరిస్థితులు చక్కబడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు దేశాలను యుద్ధం ఆపమనే స్థితిలో అమెరికా లేదని అన్నారు. యుద్ధం ఆపేలా ప్రోత్సహించే ప్రయత్నం మాత్రమే చేయగలమన్నారు. మధ్యలో కలుగజేసుకుని యుద్ధం ఆపమనడం తమ పని కాదన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఇండియన్స్‌ను యుద్ధం ఆపమని అమెరికా చెప్పలేదు.


అలాగే పాకిస్తానీలను యుద్ధం ఆపమని కూడా చెప్పలేదు. ఈ యుద్ధం తీవ్రతరమై మరింత పెద్ద యుద్ధంగా.. న్యూక్లియర్ వార్‌గా మారకూడదని కోరుకుంటున్నాను. ఇప్పటికైతే అలాంటి పరిస్థితి రాదని మేము అనుకుంటున్నాము’ అని అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భారత్, పాక్ యుద్ధంపై స్పందించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రెండు దేశాల మధ్య పరిస్థితులు ఘోరంగా ఉన్నాయని అన్నారు. భారత్, పాకిస్తాన్ గురించి నాకు బాగా తెలుసునని, ఆ రెండు దేశాలు సమస్య పరిష్కరించే దిశగా ఆలోచన చేయాలన్నారు.


ఇండియాదే విజయం

భారత్ పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం వస్తే.. కచ్చితంగా భారత్ గెలుస్తుందని అమెరికా ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ మాజీ పైలట్ డేల్ స్టార్క్ అన్నారు. భారత్, పాక్ పైలట్లు ఇద్దరితోనూ తాను గతంలో కలిసి పనిచేశాని అన్నారు. యుద్ధ పరిస్థితి ముదిరితే మాత్రం భారత్‌కే విజయం దక్కుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక, పాక్‌కు ఎఫ్-16లు విక్రయించేటప్పుడే అమెరికా ఎన్నో ఆంక్షలు విధించిందట. భారత్‌పై ఈ విమానాలను వాడొద్దని స్పష్టం చేసిందట. ఎఫ్-16ల వినియోగంపై వెయ్యి కళ్లతో నిఘా కూడా పెట్టిందట. దీంతో, ఎఫ్-16 అన్ని అవసరాలకు వినియోగించుకోలేని పరిస్థితుల్లో పాక్ ఇరుక్కుపోయినట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

To Day Gold Rates: పసిడి ప్రియులకు షాక్.. మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

Social Media Crackdown: అసభ్యకర పోస్టులను కట్టడి చేయాల్సిందే

Updated Date - May 09 , 2025 | 07:31 AM