Gaza conflict: పాలస్తీనా ప్రజలంతా లిబియాకు
ABN, Publish Date - May 18 , 2025 | 05:21 AM
అమెరికా గాజా నుంచి దాదాపు 10 లక్షల పాలస్తీనీయులను లిబియాకు తరలించే ప్రణాళికపై చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో ఇజ్రాయెల్ గాజాపై తీవ్ర దాడులు చేస్తుండగా, పాలస్తీనీయులు తమ భూమిని రక్షించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు.
వాషింగ్టన్, మే 17: ఇజ్రాయెల్ దాడుల్లో కకావికలమైన గాజా ప్రాంతం నుంచి పాలస్తీనీయులను ఖాళీ చేయించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. సుమారు పది లక్షల మంది పాలస్తీనా ప్రజలను శాశ్వతంగా లిబియాకు తరలించనున్నట్టుగా అమెరికా అధికార వర్గాలను ఉటంకిస్తూ.. ఎన్‌బీసీ న్యూస్ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించి లిబియా ప్రభుత్వంతో అమెరికా సీనియర్ అధికారులు చర్చలు జరుపుతున్నారని పేర్కొంది. పాలస్తీనా ప్రజల తరలింపునకు బదులుగా అమెరికా ఫ్రీజ్ చేసిన వేల కోట్ల రూపాయల లిబియా నిధులను విడుదల చేస్తామని ప్రతిపాదించినట్టు తెలిపింది. పూర్తిగా విధ్వంసమైన గాజా పరిస్థితి ఏమీ బాగోలేదని, ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని, వారిని ఖాళీ చేయించి.. దానిని స్వేచ్ఛా ప్రాంతం(ఫ్రీడమ్ జోన్)గా అభివృద్ధి చేస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గతంలోనే ప్రకటించడం గమనార్హం. మరోవైపు పాలస్తీనా తమ మాతృభూమి అని, దాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని పాలస్తీనా హమాస్ సీనియర్ అధికారి బసెమ్ స్పష్టం చేశారు. లిబియాలో సుమారు 14 ఏళ్ల క్రితం అంతర్యుద్ధం చెలరేగింది. అప్పటి నుంచీ ఆ దేశంలో పరిస్థితి అస్తవ్యస్తంగానే ఉంది. ఇదిలా ఉండగా, ఆపరేషన్ ‘గిడియాన్స్ చారియట్స్’ పేరుతో ఇజ్రాయెల్ శనివారం గాజాపై విరుచుకుపడింది. ఈ దాడుల్లో 100మంది మరణించారు.
ఇవి కూడా చదవండి..
Rahul Dravid: ఇక, టిక్కెట్ల గురించి భయం లేదు.. రోహిత్‌కు రాహుల్ ద్రవిడ్ ఫన్నీ మెసేజ్
Rohit Sharma: రోహిత్ శర్మకు కోపమొచ్చింది.. తమ్ముడిని ఎలా తిట్టాడో చూడండి..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..
Updated Date - May 18 , 2025 | 05:21 AM