ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Tariffs: రెండో దశ సుంకాలు

ABN, Publish Date - Sep 09 , 2025 | 03:07 AM

రష్యా మీద, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద రెండోదశ సుంకాలు విధిస్తామని...

  • ఆంక్షలతో రష్యా ఆర్థికం కూలుతుంది.. పుతిన్‌ చర్చలకొస్తారు

  • సుప్రీంకోర్టు సుంకాలు కొట్టేస్తే ఆయా దేశాలకు రిఫండ్‌ తప్పదు

  • అది పెనుభారమే.. అమెరికా ఆర్థికమంత్రి స్కాట్‌ బెసెంట్‌

వాషింగ్టన్‌, సెప్టెంబరు 8: రష్యా మీద, ఆ దేశం నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల మీద రెండోదశ సుంకాలు విధిస్తామని, అందుకు సిద్ధంగా ఉన్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ హెచ్చరించారు. ఆదివారం ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్రంప్‌ ఈ విషయం చెప్పారు. దీనిపై అమెరికా ఆర్థికమంత్రి స్కాట్‌ బెసెంట్‌ మరింత వివరణ ఇచ్చారు. యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌తో ట్రంప్‌ ఇప్పటికే మాట్లాడారని, యూరప్‌ దేశాలు (ఈయూ) కూడా కలిసి వస్తే.. రెండో దశ సుంకాలు విధించి రష్యా మీద ఒత్తిడి పెంచుతామన్నారు. ఫలితంగా రష్యా ఆర్థికవ్యవస్థ కుప్పకూలుతుందని, పుతిన్‌ చర్చలకు రాక తప్పని పరిస్థితి నెలకొంటుందని స్కాట్‌ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంపై స్పందిస్తూ.. ‘ఉక్రెయిన్‌ సైన్యం ఎంతకాలం ఎదుర్కొంటుంది.. రష్యా ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం తట్టుకొని నిలబడగలుగుతుంది అన్నదే ప్రధానం. ఈ రెండింటి మధ్యే ఇప్పుడు రేసు నడుస్తోంది’ అని స్కాట్‌ వివరించారు. మరోవైపు, అమెరికా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవ్యతిరేకమని దేశ సుప్రీంకోర్టు కొట్టేస్తే.. వాటిలో సగమైనా ఆయా దేశాలకు, సంస్థలకు తక్షణం తిరిగి చెల్లించాల్సి ఉంటుందని స్కాట్‌ బెసెంట్‌ తెలిపారు. అదే పరిస్థితి వస్తే ఆర్థికశాఖకు మోయలేని భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు ఆదేశిస్తే వాటిని పాటించకతప్పదని స్పష్టం చేశారు. ట్రంప్‌ విధించిన సుంకాలు చట్టవ్యతిరేకమని గత నెల అమెరికాలో ఒక దిగువస్థాయి కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది.

ఇవి కూడా చదవండి..

ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..

రేపే ఉపరాష్ట్రపతి ఎన్నిక

For More National News And Telugu News

Updated Date - Sep 09 , 2025 | 03:07 AM