ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Visa: 1,000 డాలర్లు చెల్లిస్తే.. నిరీక్షణ అక్కర్లేదు

ABN, Publish Date - Jun 06 , 2025 | 04:24 AM

నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీసును అందించాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది.

  • యూఎస్‌ వీసా ఇంటర్వ్యూకు కొత్తగా ప్రీమియం సేవలు

  • డిసెంబరు నుంచి అమలుచేసే యోచనలో ట్రంప్‌ సర్కారు

వాషింగ్టన్‌, జూన్‌ 5: నాన్‌ ఇమ్మిగ్రెంట్‌ వీసా దరఖాస్తుదారులకు ప్రీమియం సర్వీసును అందించాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది. అయితే దీనిని ఉపయోగించుకోవాలంటే 1,000 యూఎస్‌ డాలర్లు అంటే సుమారుగా రూ.86,000 చెల్లించాలి. డబ్బులు పెట్టుకోగలిగిన పర్యాటకులకు, వ్యాపారవేత్తలకు ఉపయుక్తంగా ఉండేలా దీనిని రూపొందించారు. ట్రంప్‌ ప్రచార విధాన సలహాదారులు మే 17న తయారు చేసిన ఓ డ్రాఫ్ట్‌ ప్రకారం వీసా ఇంటర్వ్యూకి త్వరగా వెళ్లడానికి ఇది ఉపయోగపడుతుంది. యూఎస్‌ వీసా ఇంటర్వ్యూ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఈ సమయం ఏడాదిన్నర వరకూ ఉంది.


ఈ పరిస్థితిని తప్పించడానికి ప్రీమియం సర్వీసు ఉపయోగపడుతుందని మెమోలో పేర్కొన్నారు. డిసెంబరులో దీనిని ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తోంది. ఇది ప్రస్తుత వీసా దరఖాస్తు, ఇంటర్వ్యూ ప్రక్రియల్లో ఎటువంటి మార్పును చేయబోదు. కేవలం సుదీర్ఘకాల నిరీక్షణను మాత్రమే తప్పిస్తుందని మెమోలో స్పష్టం చేశారు. వీసా దరఖాస్తు సమయంలో చెల్లించాల్సిన 185 యూఎస్‌ డాలర్లకు ఇది అదనం. 50 లక్షల యూఎస్‌ డాలర్లు చెల్లిస్తే పౌరసత్వం ఇస్తామంటూ ప్రవేశపెట్టిన ‘గోల్డ్‌ కార్డు’ పథకం ప్రకటించేనాటికి వీసా ప్రీమియం సేవల ఆలోచన తెరపైకి రాలేదు. అయితే ఇది అమలులోకి వస్తే అనేక న్యాయపరమైన చిక్కులు ఎదురుకావచ్చన్న అభిప్రాయం ప్రభుత్వ న్యాయవాదుల్లోనే వ్యక్తమయింది.

Updated Date - Jun 06 , 2025 | 04:24 AM