ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

US Military Strike: ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా.. తేదీ ఖరారైనట్టేనా

ABN, Publish Date - Jun 19 , 2025 | 10:22 AM

ఇరాన్‌ అణుస్థావరాలపై దాడులకు అమెరికా సుముఖంగానే ఉందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఏదోక వారాంతంలో ఒకేసారి ఇరాన్‌లోని పలు స్థావరాలపై దాడులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

US Iran conflict

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్‌పై (Iran) సైనిక దాడులకు (Military Strike) అమెరికా సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ విషయంలో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది. ఏదో ఒక వారాంతంలో అమెరికా (USA) దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తుది తేదీపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది.

వాల్‌స్ట్రీట్ కథనం ప్రకారం, ఇరాన్‌పై మిలిటరీ దాడి ప్రణాళికకు అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) గత వారమే అంగీకారం తెలిపారు. ఇరాన్ తన డిమాండ్స్‌కు తలొగ్గచ్చనే అంచనాతో చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా ట్రంప్ బుధవారం కీలక ప్రకటన చేశారు. ‘మేము దాడి చేయొచ్చు. చేయకపోవచ్చు. ఇది యుద్ధం. మార్పులు వేగంగా జరుగుతుంటాయి. చివరి క్షణంలో నేను ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు’ అని అన్నారు. మరో సందర్భంలో ట్రంప్ మాట్లాడుతూ అమెరికాతో డీల్‌కు ఇరాన్‌ అంగీకరించి ఉండాల్సిందని అన్నారు. ‘చివర్లో వాళ్లు డీల్‌కు నో చెప్పారు. అలా చేసి ఉండకపోతే బాగుండేదని ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు’ అని అన్నారు.

ఇరాన్‌లోని అణుస్థావరాలపై దాడులకు ట్రంప్ సుముఖంగానే ఉన్నట్టు ఏబీసీ న్యూస్ పేర్కొంది. ఒకేసారి బహుళ స్థావరాలపై అమెరికా దాడులు చేయొచ్చు. దాడి ప్రణాళికకు ట్రంప్ మంగళవారం ఓకే చెప్పారు. తదుపరి 24 గంటల్లో దాడులు చేసే అవకాశం ఉందని అప్పట్లో విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖొమైనీ బుధవారం స్పందించారు. మిలిటరీ చర్యలకు దిగితే అమెరికా కోలుకోలేని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా దాడులకు దిగితే ఆ ప్రాంతాల్లోని అగ్రరాజ్య స్థావరాలపై తాము ప్రతి దాడులు చేస్తామని అన్నారు. ఇక ఖొమైనీ హెచ్చరికలను ట్రంప్ ఖాతరు చేయలేదు. ఇరాన్‌కు గుడ్ లక్ అని వ్యాఖ్యానించారు. ‘ఇరాన్‌కు అణ్వాయుధాన్ని దక్కనీయము. ఎప్పటి నుంచో నేను ఇదే చెబుతున్నాను. ఈ విషయంలో ప్రస్తుతం మరింత సీరియస్‌గా ఉన్నాను’ అని అన్నారు.

అమెరికా దళాలను రంగంలోకి దించడంపై ట్రంప్ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. అయితే, మిలిటరీ చర్యలను కొనసాగించాలని ఇజ్రాయెల్‌తో అన్నట్టు ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. గత శుక్రవారం నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకూ తాము 400 బాలిస్టిక్ క్షిపణులు, వందలాది డ్రోన్‌లను ప్రయోగించినట్టు ఇరాన్ పేర్కొంది. ప్రత్యర్థి దాడుల్లో తమ పౌరులు 24 మంది మరణించారని ఇజ్రాయెల్ తెలిపింది. తాము జరిపిన వైమానిక దాడుల్లో 224 మంది ఇరానియన్లు మరణించారని, టెహ్రాన్‌లో 20కి పైగా అణు, మిలిటరీ స్థావరాలపై దాడి చేశామని వెల్లడించింది.

ఇవీ చదవండి:

36 దేశాలపై ట్రావెల్ బ్యాన్.. యోచనలో అమెరికా

భారత్‌ను బలహీనపరిచేందుకు అమెరికా తప్పక ప్రయత్నిస్తుంది.. యూఎస్ ఆర్థికవేత్త హెచ్చరిక

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 12:58 PM