విమానం హైజాక్ చేయాలనుకున్నాడు.. తోటి ప్రయాణికుడి చేతిలో చచ్చాడు..
ABN, Publish Date - Apr 18 , 2025 | 09:52 AM
US Man Attempts To Hijack Plane: ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిపై కూడా అతడు దాడి చేయడానికి ప్రయత్నించాడు. తోటి ప్రయాణికుడు తుపాకితో టేలర్‌ను కాల్చేశాడు. టేలర్ అక్కడికక్కడే చనిపోయాడు.
విమానం హైజాక్ చేయాలనుకున్న ఓ వ్యక్తికి దారుణమైన శిక్ష పడింది. కత్తితో విమానంలోని వారిని చంపడానికి ప్రయత్నించిన అతడ్ని తోటి ప్రయాణికుడు కాల్చి చంపేశాడు. ఈ సంఘటన బిలైజ్‌లో గురువారం చోటుచేసుకుంది. అమెరికాకు చెందిన ప్రముఖ మీడియా సంస్థ న్యూయార్క్ పోస్టు తెలిపిన వివరాల మేరకు.. గురువారం ఓ చిన్న మినీ విమానం బిలైజ్ నుంచి సాన్ పెడ్రోకు వెళుతూ ఉంది. అందులో అమెరికాకు చెందిన అకిన్‌యెలా సావా టేలర్ అనే 49 ఏళ్ల వ్యక్తి కూడా ప్రయాణిస్తూ ఉన్నాడు. విమానం గాల్లో ఉండగా అతడు తనతో పాటు తెచ్చుకున్న కత్తిని బయటకు తీశాడు.
ఆ కత్తితో విమానంలోని వారిపై దాడి చేయటం మొదలెట్టాడు. ఈ నేపథ్యంలో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మిగిలిన వారిపై కూడా అతడు దాడి చేయడానికి ప్రయత్నించాడు. పరిస్థితి అదుపు తప్పుతున్న సమయంలో తోటి ప్రయాణికుడు ఒకడు సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. తుపాకితో టేలర్‌ను కాల్చేశాడు. టేలర్ అక్కడికక్కడే చనిపోయాడు. విమానం క్షేమంగా సాన్ పెడ్రో చేరుకుంది. బిలైజ్ కమిషనర్ ఆప్ ఫోలీస్ చెస్టర్ విలియమ్స్ ఈ సంఘటనపై స్పందించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. దుండగుడ్ని కాల్చి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన వ్యక్తిపై ప్రశంసల జల్లు కురిపించాడు.
అతడ్ని హీరో అంటూ పొగిడాడు. టేలర్ అధికారుల కళ్లు గప్పి ఆ కత్తి ఎలా తెచ్చాడో తెలియటం లేదని అన్నాడు. ఇక, బెలీజియన్ అధికారులు అమెరికా ఎంబసీని సంప్రదించారు. ఈ సంఘటనకు సంబంధించిన దర్యాప్తులో సహకరించాలని విజ్ణప్తి చేశారు. ఇక్కడ అర్థం కాని విషయం ఇంకోటి కూడా ఉంది. సాధారణంగా విమానాల్లోకి కత్తులు, గన్నులలాంటి ప్రమాదకరమైన వాటిని.. అసలు పదునుగా ఉండే వస్తువుల్నే అనుమతించారు. టేలర్‌ను కాల్చిన వ్యక్తి గన్ను ఎలా తీసుకెళ్లాడు?.. బహుశా అతడు స్కై మార్షల్ అయి ఉండొచ్చు.
ఇవి కూడా చదవండి
Viral Video: నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా.. రోడ్డు మీద ఆ ఫోజ్ ఏంటి.
Viral Video: పాపం.. ఈ లాయర్లకు ఎంత కష్టం వచ్చింది.. అందరి ముందు కొట్టుకున్నారు..
Updated Date - Apr 18 , 2025 | 11:20 AM