Viral Video: నువ్వేమన్నా హీరో అనుకుంటున్నావా.. రోడ్డు మీద ఆ ఫోజ్ ఏంటి..
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:48 AM
Bengaluru Man Viral Video: నడిరోడ్డుపై వీడియో తీయటమే కాకుండా.. ఆ వీడియోను తన ఇన్‌గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. వైరల్‌గా మారిన వీడియో పోలీసులు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో ఓ సీన్ ఉంటుంది. సెకండ్ హాఫ్‌కు ముందు వచ్చే ఆ ఫైట్ సీన్‌లో పవన్ కల్యాణ్ నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చుంటాడు. తర్వాత విలన్లను ఓ ఆట ఆడుకుంటాడు. మరి, బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి తనను తాను హీరో అనుకున్నాడో ఏమో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో క్రేజ్ సంపాదించటం కోసం ఓ పిచ్చి పని చేశాడు. ఆ పని వల్ల అతడి జీవితం సంకనాకి పోయింది. పోలీసులు పట్టుకెళ్లి జైలులో పడేశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అవ్వడానికి ఓ పిచ్చి పని చేశాడు.
ఏప్రిల్ 12వ తేదీన బెంగళూరు, మగాడి రోడ్డు మీదకు వచ్చాడు. నడిరోడ్డుపై కుర్చీ వేసుకుని కూర్చున్నాడు. కాలు మీద కాలు వేసుకుని టీ తాగటం మొదలెట్టాడు. రోడ్డుపై వెళుతున్న వాహనాలు అతడి పక్కనుంచి వెళుతూ ఉన్నాయి. జనం, వాహనదారులు అతడ్ని వింతగా చూస్తూ వెళ్లిపోతూ ఉన్నారు. అతడు మాత్రం ఎలాంటి బెరుకు, భయం లేకుండా స్టైల్‌గా టీ తాగాడు. తర్వాత అక్కడినుంచి వెళ్లిపోయాడు. రోడ్డు మీద తీసిన ఆ వీడియోను తన ఇన్‌గ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారిపోయింది. అదే అతడి కొంప ముంచింది.
వైరల్‌గా మారిన వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి కూడా వెళ్లింది. ఈ నేపథ్యంలోనే అతడిపై పోలీసు కేసు నమోదైంది. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. సోషల్ మీడియాలో ఫేమస్ కావటం కోసం పిచ్చి పిచ్చి పనులు చేసే వారికి హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ మేరకు ట్విటర్ ఖాతాలో ఓ పోస్టు కూడా పెట్టారు. ‘ రోడ్డు మీద ఇలా టీ తాగితే.. ఫేమస్ అవ్వటం కాదు.. భారీ జరిమానా పడుతుంది. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొన్నారు. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Viral Video: పాపం.. ఈ లాయర్లకు ఎంత కష్టం వచ్చింది.. అందరి ముందు కొట్టుకున్నారు.
Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..