Viral Video: పాపం.. ఈ లాయర్లకు ఎంత కష్టం వచ్చింది.. అందరి ముందు కొట్టుకున్నారు..
ABN , Publish Date - Apr 18 , 2025 | 08:13 AM
Fight Between Lawyers: క్లైంట్లను దక్కించుకునే విషయంలో రెండు లాయర్ల గ్రూపుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. లేడీ లాయర్లు కూడా ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సాధారణంగా లాయర్ల పని ఏంటి.. కేసులు పట్టుకోవటం.. క్లైంట్ తరపున వాదించడం. ఒకప్పుడు లాయర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అలాంటి టైంలోనే కేసులు పట్టుకోవడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. లా వైపు వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రోజు రోజుకు అడ్వకేట్లు ఎక్కువైపోతున్నారు. పెద్ద పెద్ద లాయర్లకైతే ఎలాంటి గొడవ లేదు కానీ.. చెట్టుకింద ప్లీడర్లకు మాత్రం కష్టాలు తప్పటం లేదు. కేసు పట్టుకోవడానికే నెలలు, సంవత్సరాలు గడుస్తున్నాయి. మరి, ఇలాంటి టైంలో ప్రస్టేషన్ రాకుండా ఎలా ఉంటుంది. లాయర్లు క్లైంట్ల కోసం యుద్దం చేయడానికి కూడా వెనుకాడరు.
తాజాగా, క్లైంట్ల కోసం కొంతమంది లాయర్లు దారుణంగా కొట్టుకున్నారు. వారిలో లేడీ లాయర్లు కూడా ఉన్నారు. ఢిల్లీలోని ఓ కోర్టులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. న్యూఢిల్లీలోని క్రిష్ణా నగర్‌లో స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టు ఉంది. మంగళవారం క్లైంట్లను దక్కించుకునే విషయంలో రెండు లాయర్ల గ్రూపుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. కొంత సేపటికి అది తీవ్రమైన గొడవగా మారింది. రెండు గ్రూపులు కలబడి కుమ్ముకున్నాయి. వారిలో లేడీ లాయర్లు కూడా ఉన్నారు. వారు కూడా ఒకరిపై ఒకరు చెప్పులతో దాడి చేసుకున్నారు.
గొడవలో చాలా మంది గాయాలపాలయ్యారు. రక్తాలు సైతం చిందాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ సంఘటనపై పోలీసులు స్పందించారు. రెండు వర్గాలపై కేసులు నమోదు చేశారు. అటెంప్ట్‌టు మర్డర్, రాబరీ సెక్షన్ల కింద కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వైరల్‌గా మారిన వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ.. ‘ పాపం లాయర్లకు ఎంత కష్టం వచ్చింది. పగవాడికి కూడా ఇంత కష్టం రాకూడదు’..‘ దేశంలో లాయర్లు ఎక్కువైపోయారు. కేసులు దొరకాలంటే కష్టమే’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Gold Articles: వెయ్యి కేజీల బంగారాన్ని కరిగించిన గుళ్లు.. ఎందుకంటే..
Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..