Share News

Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..

ABN , Publish Date - Apr 18 , 2025 | 06:43 AM

To Day Gold Rate In Hyderabad: నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి. నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ నగరంలో 88,150 రూపాయల నుంచి 88,150 మధ్య ట్రేడ్ అయింది..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 నుంచి 96,310 రూపాయల మధ్య ట్రేడ్ అయింది.

Gold Rate: పసిడి ప్రియులకు మళ్లీ షాక్.. ఈరోజు ఎంత పెరిగిందంటే..
Gold price today

బంగారం ధరలు రోజు రోజుకు చుక్కలు చూపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం వరకు తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. సాధారణ ప్రజలు బంగారం కొనాలంటే.. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 95 వేలనుంచి లక్ష రూపాయల మధ్య ట్రేడ్ అవుతోంది. దాదాపు ఆరు నెలల కాలంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ 60 వేల నుంచి ఏకంగా 85 వేలకు జంప్ కొట్టింది. తగ్గేదేలా అన్నట్లు ముందుకు దూసుకుపోతోంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు కొద్దిగా పెరిగాయి.


గ్రేటర్ హైదరాబాద్‌లో బంగారం ధరలు

నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,150 రూపాయల నుంచి 88,150 మధ్య ట్రేడ్ అయింది..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,170 నుంచి 96,310 రూపాయల మధ్య ట్రేడ్ అయింది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,130 నుంచి 72,980 రూపాయల మధ్య ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 96,320 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 88,210 దగ్గర ట్రేడ్ అవుతోంది..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 72,980 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


వెండి ధరలు ఇలా..

బంగారం అంత కాకపోయినా.. వెండి ధరలు కూడా రోజు రోజుకు పెరుగుతూ పోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పెద్దగా డిమాండ్ లేకపోయినా.. ధరల పెరుగుదల విషయంలో వెండి నిలకడగా సాగుతోంది. హైదరాబాద్ నగరంలో కేజీ వెండి ధర నిన్న 1,10,000 రూపాయలు ఉండింది. ఈ రోజు వెండి ధర కూడా స్వల్పంగా పెరిగింది. ఒక గ్రాము వెండి ధరపై 10 పైసలు పెరిగింది. కేజీ వెండిపై100 రూపాయలు పెరిగి.. 1,10,100 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

Beerla Ilaiah: కేటీఆర్‌వి సిగ్గుమాలిన మాటలు

Krishna Water Share Demand: 45 టీఎంసీలను తెలంగాణకే కేటాయించాలి

Updated Date - Apr 18 , 2025 | 11:11 AM