Disrupts Air Travel Nationwide: అమెరికాలో విమానాల షట్‌డౌన్
ABN, Publish Date - Nov 05 , 2025 | 04:47 AM
అమెరికాలో పౌర విమానాయనానికి ‘షట్‌డౌన్’ దెబ్బతగిలింది. రోజూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతుండటం, వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు.
వాషింగ్టన్, నవంబరు 4: అమెరికాలో పౌర విమానాయనానికి ‘షట్‌డౌన్’ దెబ్బతగిలింది. రోజూ వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దవుతుండటం, వేల సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు అల్లాడిపోతున్నారు. విమానాశ్రయాల్లో భారీగా క్యూలు నిలిచిపోతున్నాయి. గత మూడు రోజుల్లో ఏకంగా 2,282 విమానాలు రద్దయ్యాయని, 16,700 విమానాలు చాలా ఆలస్యంగా నడిచాయని అమెరికా విమానాల రాకపోకలను పరిశీలించే ‘ఫ్లైట్‌అవేర్’ సంస్థ ప్రకటించింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను సెనేట్ ఆమోదించకపోవడంతో 33 రోజులుగా ‘ప్రభుత్వ ప్రతిష్ఠంభన’ నెలకొంది. దీనితో ప్రభుత్వ ఉద్యోగులకు రెండో నెల కూడా వేతనాలు అందలేదు. దీనితో చాలా మంది అమెరికా ఫెడరల్ ఏవియేషన్(ఎ్‌ఫఏఏ) విధులకు డుమ్మా కొడుతున్నారు. ఇదిలా ఉండగా, అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్‌తో ఫెడరల్ నిధుల కొరత కారణంగా గత నెల రోజులుగా నిలిచిన హెచ్-1బీ వీసాల ప్రాసెసింగ్‌ను ఎట్టకేలకు పునరుద్ధరించారు.
Updated Date - Nov 05 , 2025 | 04:47 AM