5 Children Found Locked: రాక్షసుల్లా మారిన తల్లిదండ్రులు.. పిల్లల్ని చెరసాలలో బంధించి..
ABN, Publish Date - Sep 04 , 2025 | 01:56 PM
కన్న బిడ్డల్ని ఇంటి కింద( అండర్ గ్రౌండ్) ఉండే చెరసాల లాంటి గదిలో బంధించారు. ఆ గది చాలా భయంకరంగా ఉంది. అందులో పడుకోవడానికి బెడ్సు లేవు. మల,మూత్ర విసర్జనకు కూడా ఏర్పాట్లు లేవు.
అమెరికాలో ఓ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో అత్యంత దారుణంగా ప్రవర్తించారు. రాక్షసుల్లా మారి కన్నబిడ్డల్ని చెరసాలలో బంధించి హింసించారు. చివరకు పాపం పండి ఆ తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన పూర్తి వివరాల్లోకి వెళితే.. పెన్సిల్వేనియాకు చెందిన 65 ఏళ్ల జేమ్స్ రసెల్ కాల్, 41 ఏళ్ల కార్లీ కాల్ భార్యాభర్తలు. వీరికి ఐదుగురు పిల్లలు ఉన్నారు.
ఈ ఐదుగురి వయసు 5 నుంచి 14 సంవత్సరాల మధ్యలోనే ఉంటుంది. జేమ్స్, కార్లీ సైకోలుగా మారిపోయారు. కన్న బిడ్డల్ని ఇంటి కింద( అండర్ గ్రౌండ్) ఉండే చెరసాల లాంటి గదిలో బంధించారు. ఆ గది చాలా భయంకరంగా ఉంది. అందులో పడుకోవడానికి బెడ్సు లేవు. మల,మూత్ర విసర్జనకు కూడా ఏర్పాట్లు లేవు. దీంతో గది మొత్తం పిల్లల విసర్జనలతో నిండిపోయి దుర్వాసన వస్తూ ఉంది. దానికి తోడు ఆ గదిలో భారీ స్థాయిలో నల్లులు కూడా ఉన్నాయి.
పాపం ఆ పిల్లలు ప్రతీ రోజూ నరకం చూస్తూ ఉన్నారు. బయటకు పంపమని తల్లిదండ్రులను బ్రతిమాలుకున్నారు. అయినా వారి మనసు కరగలేదు. కేవలం తిండిపెట్టడానికి మాత్రమే గది తలుపు తెరిచే వారు. తర్వాత వెంటనే మూసేసేవారు. ఆ ఐదుగురు పిల్లలు తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం లేకుండా పోయింది. నాలుగు గోడల మధ్య నలుగురు అల్లాడిపోసాగారు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇంటి దగ్గరకు వెళ్లారు. అండర్ గ్రౌండ్ గదిలోని పిల్లల్ని బయటకు తీసుకువచ్చారు. వారిని ప్రొటెక్టివ్ కస్టడీలో ఉంచారు. తల్లిదండ్రుల్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
ఇవి కూడా చదవండి
షాకింగ్ రిపోర్ట్.. ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లు తాగకూడదు.!
పోలీస్ స్టేషన్లలో పని చేయని సీసీటీవీ కెమెరాలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
Updated Date - Sep 04 , 2025 | 02:00 PM