Share News

SC Launches Suo Motu PIL: పోలీస్ స్టేషన్లలో పని చేయని సీసీటీవీ కెమెరాలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..

ABN , Publish Date - Sep 04 , 2025 | 01:09 PM

పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు తప్పని సరిగా ఉండాలని 2020లోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నైట్ విజన్, ఆడియో రికార్డింగ్ ఉన్న సీసీటీవీ కెమెరాలను మాత్రమే ‌వాడాలని స్పష్టం చేసింది.

SC Launches Suo Motu PIL: పోలీస్ స్టేషన్లలో పని చేయని సీసీటీవీ కెమెరాలు.. సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
SC Launches Suo Motu PIL

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు పని చేయకపోవటం లేదంటూ తాజాగా ఓ జాతీయ మీడియాలో కథనం వెలువడింది. ఆ కథనంపై సుప్రీంకోర్టు స్పందించింది. భారత అత్యున్నత న్యాయస్థానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సుమోటోగా విచారణ చేపట్టడానికి సిద్ధమైంది. ఈ ఏడాది ఎనిమిది నెలల్లో ఒక్క రాజస్థాన్‌లోనే 11 పోలీస్ కస్టడీ మరణాలు సంభవించాయని బెంచ్‌లోని న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సందీప్ మెహతా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే సమస్య తీవ్రతను పరిగణనలోకి తీసుకుని సుమోటోగా స్వీకరించినట్లు తెలిపారు.


2020లోనే కీలక ఆదేశాలు..

పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాలు తప్పని సరిగా ఉండాలని 2020లోనే సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. నైట్ విజన్, ఆడియో రికార్డింగ్ ఉన్న సీసీటీవీ కెమెరాలను మాత్రమే ‌వాడాలని స్పష్టం చేసింది. సీసీటీవీ ఫుటేజీ రికార్డులను కనీసం 18 నెలలపాటు భద్రపరచాలని తెలిపింది. కస్టోడియల్ వేధింపులు, మరణాలకు సంబంధించిన దర్యాప్తు సమయంలో ఆ సీసీటీవీ కెమెరాల రికార్డులు అందుబాటులో ఉండేలాగా చూసుకోవాలని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలదే.


జాతీయ మీడియా కథనం ప్రకారం.. సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా దేశవ్యాప్తంగా ఉన్న చాలా పోలీస్ స్టేషన్లు పని చేయని సీసీటీవీ కెమెరాలతోటే కాలం వెల్లదీస్తున్నాయి. కస్టోడియల్ వేధింపుల సమయంలో సీసీటీవీ ఫుటేజీలు లేక దర్యాప్తునకు ఆటంకం ఏర్పడుతోంది. కస్టోడియల్ వేధింపుల సమయంలో సీసీటీవీ ఫుటేజీలు లేకపోవటం, టెక్నికల్ సమస్యలు దర్యాప్తునకు ఆటంకం కలిగిస్తున్నాయని పోలీస్ ఎజెన్సీలు తరచుగా చెబుతూ ఉన్నాయి.


ఇవి కూడా చదవండి

ప్రపంచంలో అత్యంత పోషకమైన ఆహారం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఈడీ ముందుకు శిఖర్ ధవన్.. బెట్టింగ్‌ యాప్‌ కేసులో విచారణ..

Updated Date - Sep 04 , 2025 | 06:21 PM