US Immigration: సైడ్ ఇన్‌కం ఉంటే బహిష్కరణే
ABN, Publish Date - Sep 09 , 2025 | 03:18 AM
అమెరికాలో వలసదారులకు దేశ బహిష్కరణ ముప్పు తీవ్రమైంది. హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులు అనధికారికంగా ఉద్యోగాలు..
హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులకు అమెరికా హెచ్చరిక
వాషింగ్టన్, సెప్టెంబరు 8: అమెరికాలో వలసదారులకు దేశ బహిష్కరణ ముప్పు తీవ్రమైంది. హెచ్1బీ, ఎఫ్1 వీసాదారులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తున్నట్టు తేలితే ముప్పు తప్పదని ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. అనధికారిక ఉద్యోగాలు(సైడ్ జాబ్స్) చేసేవారిని గుర్తించేందుకు ఇమ్మిగ్రేషన్ అధికారులు ఐఆర్‌ఎ్‌స(ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్) సమాచారంపై ఎక్కువగా ఆధారపడుతున్నారు. హెచ్1బీ లేదా ఎఫ్-1 వీసాదారులు అనధికారికంగా ఉద్యోగాలు చేస్తూ ఆదాయం పొందుతున్నట్టు గుర్తిస్తే అలాంటి వారికి వీసా నిరాకరించడం, దేశంలోకి ప్రవేశాన్ని నిరాకరించడంతోపాటు దేశం నుంచి బహిష్కరణకు గురయ్యే అవకాశం కూడా ఉందని తాజాగా ఒక ఆంగ్ల పత్రిక కథనం వెల్లడించింది. సైడ్ ఇన్‌కంను గుర్తించేందుకు పన్నుల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది. ‘ఐఆర్‌ఎస్ స్పష్టంగా ఐసీఈ(ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్)తో సమాచారాన్ని పంచుకుంటోంది. అనధికారికంగా ఉద్యోగాలు చేసేవారిని గుర్తించి చర్యలు చేపట్టే ప్రక్రియను మేం ప్రారంభించాం’ అని ఇమ్మిగ్రేషన్ అటార్నీ జత్ షావో తెలిపారు.
ఇవి కూడా చదవండి..
ఉప రాష్ట్రపతి ఎన్నికలో తొలి ఓటు వేసేది ఎవరంటే..
For More National News And Telugu News
Updated Date - Sep 09 , 2025 | 03:18 AM