ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Zelensky: నేరుగా చర్చలు జరుపుదామన్న రష్యా.. ఉక్రెయిన్ అధ్యక్షుడి షరతు ఏంటంటే..

ABN, Publish Date - May 11 , 2025 | 08:54 PM

బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టైతేనే రష్యాతో నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధమని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ధ్రువీకరించాలని పుతిన్‌ను కోరారు.

Ukraine Russia ceasefire

ఇంటర్నెట్ డెస్క్: రష్యా బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించినట్టు ధ్రువీకరించాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ విజ్ఞప్తి చేశారు.అప్పుడే రష్యాతో నేరుగా చర్చలకు తాను అంగీకరిస్తానని స్పష్టం చేశారు. మృదువు మాటల మాటున యుద్ధ కాంక్షను దాచుకోవద్దని అన్నారు. సోమారం మొదలు 30 రోజుల పాటు కాల్పుల విరమణ పాటించాలన్న జెలెన్‌స్కీ ప్రతిపాదనకు యూరోప్‌లోని ప్రముఖ దేశాలతో పాటు అమెరికా కూడా మద్దతు ప్రకటించింది. దీనిపై స్పందించిన రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రతిపాదించారు. టర్కీలో చర్చలు జరపుదామని పేర్కొన్నారు.


పుతిన్ చర్చల ఆఫర్‌పై జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యుద్ధం ముగించాలన్న ఉద్దేశానికి రష్యన్లు రావడం ఓ సానుకూల సంకేతం. యుద్ధం ముగించేందుకు కాల్పుల విరమణ తొలి అడుగు. ఇకపై ఒక్క రోజు కూడా ఈ మారణహోమాన్ని కొనసాగించడం నిరర్ధకం. అయితే, బేషరతుగా కాల్పుల విరమణకు అంగీకరించామని రష్యా ధ్రువీకరించాలి. అప్పుడు ఉక్రెయిన్ కూడా నేరుగా చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉంటుంది’’ అని ఎక్స్ వేదికగా అన్నారు. మొదట కాల్పుల విరమణ తరువాత మిగతా విషయాలు ప్రారంభమవుతాయని జెలెన్‌స్కీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కూడా స్పష్టం చేశారు. యుద్ధ కాంక్షలు మాటల గారడీ మాటున దాచుకోవద్దని హితవు పలికారు.


ఇవి కూడా చదవండి:

Pakistan: మీ సాయం మరువలేనిది.. ట్రంప్‌కు పాక్ కృతజ్ఞతలు ..

Awami League Banned: షేక్ హసీనా అవామీ లీగ్‌ బ్యాన్

Russia- Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్ దాడి..

మరిన్ని అంతర్జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 11 , 2025 | 08:54 PM