Awami League Banned: షేక్ హసీనా అవామీ లీగ్ బ్యాన్
ABN , Publish Date - May 11 , 2025 | 05:37 PM
షేక్ హసీనా అవామీ లీగ్ ను యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక బంగ్లాదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ఇప్పటికే హసీనా పారిపోయి భారత్ లో తలదాచుకుంటే, సందట్లో సడేమియాలా మాజీ అవామీ లీగ్ నాయకుడైన అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి పారారైపోయాడు.

Sheikh Hasina's Awami League Banned: ఢాకా: బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పార్టీని నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికార యూనస్ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. హసీనా పార్టీపై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ వేలాది మంది బంగ్లాదేశ్ ప్రజలు యూనస్ నివాసం వెలుపల ర్యాలీ చేసిన ఒక రోజు తర్వాత ఈ నిషేధం ప్రకటన వచ్చింది.
గతేడాది షేక్ హసీనాను పదవీచ్యుతురాలిని చేయడానికి కారణమైన సామూహిక నిరసనలపై తీవ్ర అణిచివేతకు హసీనా పాల్పడ్డారన్నది ఆమె మీదున్న ప్రధాన ఆరోపణ. ఈ అణిచివేతకు సంబంధించి విచారణ ఫలితం(తీర్పు) వచ్చే వరకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం.. మాజీ ప్రధాన మంత్రి షేక్ హసీనా రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్‌ను నిషేధించింది. కాగా, ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, జూలై 2024లో హసీనా ప్రభుత్వం ప్రతిపక్షాలను అణిచివేయడానికి చేయడానికి తీసుకున్న క్రూరమైన చర్యల్లో 1,400 మంది నిరసనకారులు మరణించారని పేర్కొంది.
"అవామీ లీగ్ సహా ఆపార్టీ నాయకులపై విచారణ ముగిసే వరకు అవామీ లీగ్ పార్టీ కార్యకలాపాలను (సైబర్‌స్పేస్‌లో సహా) నిషేధించాలని నిర్ణయించబడింది" అని బంగ్లా ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ విలేకరులకు తెలిపారు. దేశ "సార్వభౌమాధికారం, భద్రత" ఇంకా, "నిరసనకారుల భద్రత"ను నిర్ధారించడానికి, వీటికి సంబంధించిన సాక్ష్యులను రక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నజ్రుల్ చెప్పారు.
మరోవైపు, బంగ్లాదేశ్ తాత్కాలిక నాయకుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ముహమ్మద్ యూనస్.. హసీనా పదవీచ్యుతురాలైనప్పటి నుండి తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏకకాలంలో దేశ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ చట్టానికి సవరణను ఆమోదించింది. ఇది అధికారులు, రాజకీయ పార్టీలు, వాటి అనుబంధ సంస్థలపై విచారణ జరపడానికి వీలు కల్పిస్తుంది. అయితే, అవామీ లీగ్ ఈ పరిపాలన చర్య(చట్టం)ను తిరస్కరించింది. దీనిని "చట్టవిరుద్ధం" అని పేర్కొంది.
ఇలా ఉండగా, కాగా, అవామీ లీగ్ నాయకురాలు, మాజీ బంగ్లా ప్రధాని షేక్ హసీనా దేశం నుంచి పారిపోయి, ప్రస్తుతం భారతదేశంలో స్వయం ప్రకటిత ప్రవాసంలో ఉంది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడినట్లు ఆరోపణలపై ఢాకా నుండి జారీ చేయబడిన అరెస్ట్ వారెంట్‌ను ధిక్కరించి ఆమె ప్రస్తుతం ఇండియాను శరణుకోరుకుని తలదాచుకుంటున్నారు.
మరోవైపు, గురువారం మాజీ అవామీ లీగ్ నాయకుడైన అబ్దుల్ హమీద్ కూడా దేశం విడిచి పారిపోయాడు. హమీద్ నిష్క్రమణ నేపథ్యంలో నిర్లక్ష్యం వహించినందుకు విమానాశ్రయ రాకపోకలను పర్యవేక్షించే ముగ్గురు పోలీసు అధికారులను బంగ్లా ప్రభుత్వం తొలగించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు
ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి
మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్
For More TS News and Telugu News
పాకిస్థాన్‌ని పరుగులెట్టించిన భారత ధీరులు