Miss World 2025: శాంతి, ఐక్యత సందేశం ఇచ్చిన ఆరంభ వేడుకలు
ABN , Publish Date - May 11 , 2025 | 01:09 PM
Miss World 2025: 110 దేశాల నుంచి వచ్చిన అందాల తారలతో పాటు, విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించింది. ప్రపంచమంతా ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షించారు.

Hyderabad: మిస్ వరల్డ్ 2025 (Miss World 2025) ఆరంభ వేడుకలు (Opening Ceremony) ప్రపంచానికి శాంతి, ఐక్యత సందేశాన్ని (Unity Message) ఇచ్చాయి. హైదరాబాద్ (Hyderabad) దేశంలోనే అత్యంత సురక్షితమైన, భద్రమైన నగరమని మరోసారి చాటుకుంది. ఇండియా (India), పాకిస్థాన్ (Pakistan) మధ్య అలుముకున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌లో జరిగిన మిస్ వరల్డ్ 2025 ప్రారంభోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా, ప్రశాంతంగా జరిగాయి. ప్రపంచ శాంతికి, ఐక్యతకు మిస్ వరల్డ్ పోటీలు కూడా పాటుపడతాయని నిర్వాహకులు ప్రకటించారు.
110 దేశాల నుంచి అందాల తారలు..
110 దేశాల నుంచి వచ్చిన అందాల తారలతో పాటు, విదేశీ అతిథులకు తెలంగాణ ప్రభుత్వం మంచి ఆతిథ్యంతో పాటు, అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించింది. ప్రపంచమంతా ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఆసక్తిగా తిలకించారు. దేశ విదేశాల్లో ఈ అందాల ఈవెంట్‌ను కోట్లాది మంది వీక్షించారు. దాదాపు వెయ్యి మందికిపైగా వివిధ దేశాలకు చెందిన జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు ఈ ఈవెంట్‌ను నేరుగా, ఆన్‌లైన్ ద్వారా కవర్ చేశారు. తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను ఈ వేడుకలు మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాయి.
శాంతి భద్రతలకు సురక్షితమైన నగరం..
తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో పాటు భౌగోళికంగా, నైసర్గికంగా హైదరాబాద్‌లో ఉన్న పర్యావరణం విదేశీ అతిథులను అమితంగా ఆకట్టుకుంది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు తోడు పాశ్చాత్య దేశాల కల్చర్ మేలవింపుగా ఈ కార్యక్రమం కొనసాగింది. శాంతి భద్రతలకు సురక్షితమైన నగరంగా హైదరాబాద్ మరోసారి దేశంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంది. అటు ఐటీ రంగం నుంచి ఇటు అందాల సామ్రాజ్యం వరకు అన్ని రంగాల్లో పెట్టుబడులకు తెలంగాణలను ఉన్న సానుకూల అంశాలు. ఈ అవకాశాలన్నీ నెలరోజుల మిస్ వరల్డ్ వేడుకల ద్వారా ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించనున్నాయి.
Also Read: ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడు
వైభవంగా ప్రారంభ వేడుకలు..
కాగా శనివారం సాయంత్రం గచ్చిబౌలిలోని ఇండోర్ స్టేడియంలో మిస్ వరల్డ్-2025 పోటీలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. దాదాపు రెండున్నర గంటలపాటు ఈ కార్యక్రమం జరిగింది. ఈ పోటీలతో.. ఉద్యమగడ్డ తెలంగాణపై ప్రపంచ దేశాలన్నీ సాక్షాత్కరించాయి. ఆయా దేశాల జెండాలతో వారంతా కలిసి ఒకేసారి ర్యాంపుపైకి రాగా.. భారత్ తరఫున మిస్ ఇండియా నందినీ గుప్తా జాతీయ జెండాతో అందరికీ అభివాదం చేశారు. ఆ ఘట్టం ఉద్విగ్నభరితంగా సాగింది. పాకిస్థాన్‌తో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో.. ప్రపంచ దేశాలు పాల్గొనే మిస్ వరల్డ్ పోటీల్లో భారతదేశ జెండా కనబడగానే ‘‘భారత్ మాతాకీ జై’’ అనే నినాదంతో స్టేడియం మార్మోగింది. తెలంగాణ గేయంతో ప్రారంభమైన 72వ మిస్ వరల్డ్ పోటీల ప్రారంభ కార్యక్రమం.. జాతీయగీతం జనగణమనతోపాటు అంతకుముందు మిస్‌వరల్డ్ గీతం ఆలాపనతో ముగిశాయి. మరోవైపు అందాలబామల ప్రదర్శన మధ్యలో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, వాటి ఔన్నత్యం తదితర అంశాలతో కూడిన కొన్ని వీడియో సందేశాలను ప్రదర్శించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎప్‌సెట్ ఫలితాలు విడుదల చేసి సీఎం రేవంత్ రెడ్డి
మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్
For More AP News and Telugu News